కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఐదు రోజులుగా పరిహారం కోసం ముంపువాసులు ఆందోళన చేస్తున్నారు. గండికోట నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తాళ్ల పొద్దుటూరు ఎస్సీ కాలనీలో గండికోట నీరు చేరడంతో వీలైనంత త్వరగా వారిని ఖాళీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు ఆ గ్రామానికి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడుతున్నారు. గ్రామంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అక్కడ 144 సెక్షన్ విధించారు.
ఇదీ చదవండి: ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో జాప్యం