హైదరాబాద్ పట్టణ శివారులో విజయవాడ హైవేకు ఆనుకుని ఉన్న మహవీర్ హరిణి వనస్థలి పార్క్‌ను కొందరు అమ్మకానికి పెట్టడం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర అటవీ శాఖ చెందిన 4వేల ఎకరాల్లో 1994 సంవత్సరంలో జింకల పార్క్‌ను నిర్మించగా దానికి జాతీయ పార్క్ హోదా కల్పించారు. 1996లో దానికి ప్రహరీ గోడను నిర్మించారు. అప్పటికే అందులోని 2,400 ఎకరాల భూమి మాదేనంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటవీ అధికారులకు, పిటిషనర్లకు మధ్య జరిగిన వివాదంలో ధర్మాసనం ఆ వివాద స్థలం అటవీ శాఖకే చెందుతుందని తీర్పునిచ్చింది.
తాజాగా 2019 ఆగస్టులో యూసఫ్ ఖాన్, వాసం తులసమ్మ అలియాస్ సుల్తానా పేరుపై సర్వే నెం 7లోని 2400 ఎకరాలు తమవేనంటూ స్టాంప్ పేపర్లు సృష్టించారు. వీటిపై పూర్తి హక్కుదారులం తామేనంటూ పేర్కొన్నారు. వీటిలోని కొంత భూమి చొప్పున అమ్మకానికి పెడుతున్న స్టాంప్ పత్రాలు ప్రస్తుతం సర్వత్రా కలకలం సృష్టిస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులు కోరుతున్నారు.
![property-issue-over-mahaveer-national-park](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6136633_dkf.jpg)
![property issue over mahaveer national park](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6136633_a2.jpg)
![property issue over mahaveer national park](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6136633_a1.jpg)
![property issue over mahaveer national park](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6136633_a3.jpg)
![property issue over mahaveer national park](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6136633_a4.jpg)
ఇవీ చూడండి: 'టిండర్' ఎఫెక్ట్: స్నేహం పేరుతో మోసం చేసిన హైటెక్ కిలాడి