ETV Bharat / city

అగ్రికల్చరల్ యూనివర్సిటీకి.. ప్రతిష్టాత్మక పురస్కారం

రాష్ట్రంలోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మరొక ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ప్రముఖ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. 'సమృద్ధి కృషి శిక్షా సమ్మాన్-2020' పురస్కారాన్ని యూనివర్సిటీకి అందజేసింది.

prof jayashankar Agricultural University got  Prestigious Award
అగ్రికల్చరల్ యూనివర్సిటీకి.. ప్రతిష్టాత్మక పురస్కారం
author img

By

Published : Feb 11, 2021, 5:34 PM IST

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి మరొక ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. వరి సాగులో తడి-పొడి విధానాన్ని అమలుపరిచి రైతులకు అవగాహన కల్పించినందుకు గాను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ 'సమృద్ధి కృషి శిక్షా సమ్మాన్-2020' పురస్కారాన్ని యూనివర్సిటీకి అందజేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో ఉపకులపతి డా. ప్రవీణ్‌రావుకు.. సంస్థ ప్రతినిధి వంశీకృష్ణారెడ్డి అవార్డును అందజేశారు.

అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, రూ. 51వేల నగదు ప్రోత్సాహాన్ని.. సంస్థ, యూనివర్సిటీకి అందజేసింది. గత ఏడాది మార్చిలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

పురస్కారం అందుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉంది. కృషి విజ్ఞాన, ఏరువాక కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని పది జిల్లాల రైతులకు అవగాహన కల్పించి.. తడి - పొడి విధానాన్ని అమలుచేశాం. ఈ విధానం వల్ల 4శాతం అదనపు దిగుబడి సాధించాం. 24శాతం నీరు కూడా ఆదా అయింది.

- ఉపకులపతి డా. ప్రవీణ్‌రావు

ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డా. సుధీర్‌కుమార్, పరిశోధన సంచాలకులు డా. జగదీశ్వర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అ'ధర'హో అంటున్న కంది... ఆనందంలో రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.