ETV Bharat / city

పోలీసు శాఖలో ‘జంట’ వేదన... కుటుంబాలకు దూరమై

భార్య ఓచోట.. భర్త మరోచోట విధులు నిర్వర్తించాల్సి రావడంతో దంపతులైన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికి చెప్పాలో తెలియక.. సమస్యకు పరిష్కారమెప్పుడో తెలియక సతమతమవుతున్నారు. ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

police spouse transfers
police spouse transfers
author img

By

Published : Apr 18, 2022, 6:29 AM IST

‘370 జీవో వల్ల కుటుంబానికి 250 కి.మీ.ల దూరంలో ఉండాల్సిరావడంతో మానసికంగా కుంగిపోతున్నాను. నా జీవిత భాగస్వామి బదిలీకి అవకాశం కల్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటా..’ అంటూ ఓ కానిస్టేబుల్‌ ఆవేదన మరిచిపోకముందే మరో మహిళా కానిస్టేబుల్‌ వాట్సప్‌లో పంపిన సందేశం పోలీస్‌శాఖలో కలకలం రేపుతోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ గారికి నమస్కారం.. ఇటీవలే నేను రాజన్న సిరిసిల్ల నుంచి జగిత్యాలకు బదిలీ అయ్యాను. నా భర్త సిరిసిల్లలో 17వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ‘స్పౌజ్‌’ నిబంధనలు మాకు వర్తించడంలేదు. నా భర్త ఒక దగ్గర.. నేనొక దగ్గర పనిచేస్తున్నాం. మాకు మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. అతడిని చూసుకునేవారు ఎవరూలేక మూడు నెలల నుంచి నాతో పాటే విధులకు తీసుకొస్తున్నాను. బాబు ఆనారోగ్యానికి గురయ్యాడు. నాకు బతకాలనిలేదు. నేను నా బాబు చనిపోతాం’ అంటూ ఆవేదన వెలిబుచ్చడం సంచలనంగా మారింది.

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మంజుల ఏడుస్తూ వాట్సాప్‌లో పెట్టిన ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీంతో ఆదివారం సదరు మహిళా కానిస్టేబుల్‌ను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి ధైర్యం చెప్పినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. పోలీసు శాఖలో ‘స్పౌజ్‌’ నిబంధనల వల్ల కలుగుతున్న వేదనకు ఇవి నిదర్శనాలు. భార్య ఓచోట.. భర్త మరోచోట విధులు నిర్వర్తించాల్సి రావడంతో దంపతులైన సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఎవరికి చెప్పాలో తెలియక.. సమస్యకు పరిష్కారమెప్పుడో తెలియక సతమతమవుతున్నారు. ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్పందించాలని కోరుతున్నారు.

కుటుంబాలకు దూరమై.. మానసిక క్షోభకు గురై..: మిగతాశాఖల్లోనూ స్పౌజ్‌ బదిలీల సమస్యలున్నా.. పోలీసుశాఖలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. మిగిలిన శాఖల్లో పండగలు, ఆదివారాల్లో సెలవులు లభిస్తుండగా పోలీసుశాఖలో అలాంటి అవకాశం తక్కువ. ఏ సమయంలో పిలిచినా విధుల్లోకి వెళ్లాల్సి రావడం.. కుటుంబాలకు దూరంగా ఉండడం.. సెలవులు దొరక్కపోవడం.. రోజుల తరబడి పిల్లల్ని చూసుకునే అవకాశం లేకపోవడం వంటి కారణాలతో ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.

మరోవైపు బదిలీల సమస్యకు పరిష్కారం ప్రభుత్వం వద్ద ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులు ఏం చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యమవుతున్నందున ఆలోగా అటాచ్‌మెంట్ల ద్వారా దంపతులకు ఒకే ప్రాంతంలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌ ఉంది.

ఇదీ చదవండి : పరువు హత్య కలకలం.. రూ.10 లక్షల సుపారీతో అల్లుడిని చంపించిన మామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.