ETV Bharat / city

corona effect: కాటికాపరులుగా ప్రైవేటు టీచర్లు, చిరుద్యోగులు - ప్రైవేటు టీచర్ల సమస్యలు

"కడుపు చించుకు పుట్టిందొకరు. కాటికి నిన్ను మోసేదొకరు. తలకు కొరివి పెట్టేదొకరు.. ఆపై నీతో వచ్చేదెవరు..!’’ జీవితగమనం మొత్తాన్ని నాలుగే ముక్కల్లో ఇంత గొప్పగా చెప్పారు ఆచార్య ఆత్రేయ. ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో మానవ సంబంధాలు కొడిగట్టిపోతున్నాయి.. రక్తసంబంధాలు దూరమవుతున్నాయి.. మనసు పీకుతున్నా వైరస్‌ భయంతో మృతదేహాలను తాకాలంటే కుటుంబసభ్యులైనా ముందుకురాని పరిస్థితి. మరి వాటి తరలింపు ఎలా? కాష్టం పేర్చేదెవరు? తలకొరివి పెట్టేదెవరు?!మరోవైపు.. కరోనా అన్నిరకాల ఉపాధులనూ ఊడ్చేసింది.. బడులు మూతపడి.. వ్యాపారాలు తడబడి.. ఉపాధి కొరవడి అలోలక్షణా అంటున్నవారు ఎందరో! ఇలాంటి పరిస్థితుల్లో శవాలను తరలిస్తూ.. చితిమంటలు వెలిగిస్తూ కాష్టాలపురిలోనే కొందరు ఉపాధి పొందుతున్నారు. తాత్కాలికంగా కాటికాపరులుగా మారిపోయారు.

private teachers and employees became kati kapari

author img

By

Published : May 27, 2021, 6:47 AM IST

పిల్లలకు పాఠాలు నేర్పిన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడొకరు కొవిడ్‌ మృతుల శవాలను కాలుస్తున్నారు. పాకశాల నిపుణుడు చితికి కట్టెలు పేరుస్తున్నారు. క్రెడిట్‌ కార్డులు, బ్యాంకు రుణాలు ఇప్పించే సేల్స్‌మేన్లు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లుగా పనిచేసిన చిరుద్యోగులు, నిరుద్యోగులు కొందరు అంబులెన్సులతో జతకట్టి మృతదేహాలను తరలిస్తున్నారు. వీరంతా శ్మశానవాటికలు, శవాల గదికి పూర్తిగా కొత్తవారే. చాలామందికి పాడె మోసిన అనుభవమైనా లేదు. అలాంటిది.. కరోనా కల్లోలంలో లాక్‌డౌన్‌ సృష్టించిన విపత్తుకు తలొగ్గి తాత్కాలికంగా కాటికాపరుల అవతారమెత్తారు. వైద్య సిబ్బంది కూడా తాకడానికి ఇష్టపడని కుళ్లిన శవాలకూ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

టీచరు కుమార్‌కు కొత్త పాఠం

ఫిలింనగర్‌ బస్తీలో నివాసముంటూ దగ్గర్లోని ప్రైవేటు పాఠశాలలో టీచరుగా పనిచేసేవాడిని. లాక్‌డౌన్‌తో బడి మూతపడింది. నాది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. పూర్తి లాక్‌డౌన్‌ వల్ల ఏ పనీ దొరకలేదు. కొవిడ్‌తో ఎవరైనా చనిపోతే శవాలను ముట్టుకోడానికి భయపడుతున్నట్లు వార్తలు చూశాను. దానినే ఉపాధికి అవకాశంగా మార్చుకోవచ్చేమో అనిపించింది. గాంధీ ఆసుపత్రి చుట్టూ తిరిగా. శవాలు మోస్తాను, ఎంత ఇస్తారని అంబులెన్సుల వారిని అడిగా. రోజుకు రూ. 2,000 అన్నారు. పీపీఈ కిట్‌ వేసుకుని మృతదేహాన్ని అంబులెన్సులో ఎక్కించడం, శ్మశానవాటికలో దింపే పనిలో చేరాను. కొన్నిరోజులకు శవాలతో పాటు వాటిని మోసేవారూ పెరిగారు. కూలీ తగ్గింది. అప్పుడు శ్మశానవాటికలో కొవిడ్‌ మృతులను కాల్చే పని చేశా. గత అక్టోబరు నాటికి కూలి తగ్గింది. లాక్‌డౌన్‌ ఎత్తేయడంతో బయటికొచ్చి మళ్లీ టీచరుగా చేరా. రెండోసారి లాక్‌డౌన్‌తో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. టీచర్‌ ఉద్యోగం పోవడంతో మరోసారి శ్మశానవాటిక వైపే అడుగులేశా. నాతో పాటు మరి కొందరు ప్రైవేటు టీచర్లు అప్పుడప్పుడు ఈ పనికి వస్తున్నారు. జీవితం నాకు నేర్పిన కొత్త పాఠమిది. నెలకు రూ. 30 వేల వరకు వస్తున్నాయి.

సంజయ్‌ మాస్టర్‌..

కొవిడ్‌ మొదటిదశ వ్యాప్తికి ముందు శుభకార్యాల్లో వంటలు చేసేవాడిని. లాక్‌డౌన్‌ కారణంగా బయట వేడుకలు బంద్‌ అయ్యాయి. ఏం చేయాలో తోచలేదు. చివరకు శవాల తరలింపు పనిలో కుదిరా. ఇటీవల కొంపల్లిలోని ఓ ఇంట్లో మహిళ అనారోగ్యంతో చనిపోయారు. ఆమె కుమారుడి మానసిక స్థితి సరిగా లేక 12 రోజుల వరకు ఇది బయటకురాలేదు. దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు పిలిపించిన అంబులెన్సు సిబ్బంది కుళ్లిపోయిన శవాన్ని చూసి వెనక్కి వెళ్లిపోయారు. బల్దియా అధికారులు మమ్మల్ని వెళ్లమన్నారు. మాటల్లో చెప్పలేని స్థితిలో ఉంది మృతదేహం. గుండె నిబ్బరం చేసుకుని శవాన్ని వస్త్రంతో చుట్టా. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వచ్చే అనాథ శవాలూ దాదాపు అదే స్థితిలో ఉంటాయి. అలాంటివారికి దహన సంస్కారాలు నిర్వహించడాన్ని మేం పుణ్యకార్యంగా భావిస్తున్నాం. మొదట్లో నెలకు రూ. 50 వేల వరకు వచ్చేవి. ఇప్పటికీ నా వృత్తిని దూరం చేసుకోకుండా.. నాతోపాటు పనిచేసే సిబ్బందికి శ్మశానంలో మూడు పూటలా వండి పెడుతూ ‘మాస్టర్‌’ అని పిలిపించుకుంటున్నా. మొదటి లాక్‌డౌన్‌ సమయంలోనే పూట గడవటం కష్టమై భార్య, పిల్లల్ని ఊరికి పంపించేశా. ఇప్పుడు ప్రతినెలా వాళ్లకు డబ్బు పంపిస్తున్నా.

కేఫ్‌ నుంచి కష్టాల మధ్యకు చేరిన నరేందర్‌..

రెండేళ్ల క్రితం గచ్చిబౌలిలోని ఓ కేఫ్‌లో మేనేజర్‌గా చేరా. హుందాతనంతో కూడిన జీవితం. అప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు మర్చిపోయి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించా. ఉప్పెనలా వచ్చిన కొవిడ్‌ ఉపాధిని దెబ్బతీసింది. పెళ్లి కోసం చేసిన అప్పులు ఆందోళనలోకి నెట్టాయి. బ్యాంకు రుణం కిస్తీలు చెల్లించలేకపోయా. ఇబ్బందులు తెలిస్తే కొత్త కాపురం కుంటుపడుతుంది. దిక్కుతోచని స్థితిలో గాంధీ ఆసుపత్రి దారి చూపింది. నాలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఓ స్నేహితుడితో కలిసి మార్చురీ వద్ద ఆరా తీయగా పని ఖాయమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రొటోకాల్‌ ప్రకారం శవాలకు అంత్యక్రియలు నిర్వహించే విధానాన్ని మేమే మొదలుపెట్టాం. అంబులెన్సు డ్రైవరు, శవాన్ని మోసేందుకు నలుగురు సహాయకులు, క్రిమి సంహారక మందు పిచికారి చేసేందుకు ఓ వ్యక్తితో కలిపి ఆరుగురితో కూడిన రెండు బృందాలను అధికారులు సిద్ధం చేశారు. అలా ఎంపిక చేసిన 12 మందిలో నా స్నేహితుడితోపాటు మిగిలినవారు లాక్‌డౌన్‌ ఎత్తేశాక వెళ్లిపోయారు. ఇప్పుడు ముగ్గురం మిగిలాం. నాకు చదువు ఉండటంతో అధికారులు ఓ శ్మశానవాటికలో కొవిడ్‌ అంత్యక్రియల నిర్వహణ బాధ్యత అప్పగించారు. కొవిడ్‌ రెండోదశ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక.. కొందరు చిరుద్యోగులు నా దగ్గరకు పని కోసం వస్తున్నారు. కూలీలు సరిపోని రోజుల్లో వాళ్లను పిలిపిస్తున్నా. నేను శ్మశానవాటికలో పనిచేస్తున్నట్లు నా భార్యకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నా.

అస్థికలు ఏరేదీ వీరే..

హైదరాబాద్‌ నగరంలోని ఈఎస్‌ఐ, పంజాగుట్ట, బన్సీలాల్‌పేట, కాచిగూడ, మెహిదీపట్నం, తదితర శ్మశానవాటికల్లో కొవిడ్‌ అంత్యక్రియలు జరుగుతుంటాయి. ఈఎస్‌ఐ శ్మశానవాటిక అయితే నిత్యం రద్దీగా ఉంటుంది. ఒక సమయంలో రోజుకు 40కి పైగా శవాలను అక్కడ కాల్చేవారు. ఉదయం 5.30 గంటల నుంచి ఏర్పాట్లు మొదలవుతాయి. ముందురోజు రాత్రి కాల్చిన చితుల వద్ద పొగలు కక్కుతున్న బూడిదలోంచి అస్థికలను తీసి కుండల్లో భద్రపరచడంతో పని మొదలవుతుంది. సాధారణంగా అయితే తలకొరివి పెట్టినవారే మూడోరోజున వచ్చి అస్థికలు సేకరించి పుణ్యనదుల్లో నిమజ్జనం చేస్తుంటారు. ఇప్పుడా పని వీళ్లే చేస్తున్నారు. తర్వాత ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి కొత్తగా కట్టెలు పేర్చుతారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే దహనాలు రాత్రి 9 వరకు కొనసాగుతుంటాయి. వీరంతా అక్కడే భోజనం చేస్తారు. ఇలాంటివారు ఒక్కో శ్మశానవాటికలో 30 నుంచి 60 మంది వరకు ఉంటున్నారు. నిరుద్యోగ యువత, రకరకాల చిరుద్యోగులు ఈ పనిచేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల వాహనాల సాయంతో మరో 100 మంది అంతిమయాత్ర వాహనాలు నడిపిస్తున్నారు.

ఇదీ చూడండి:

JUDAs strike: అర్ధరాత్రి వరకు చర్చోపచర్చలు.. నేడు తుది నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.