Heavy Rates for Vinayaka Idols: ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో వినాయక ఉత్సవాలకు కరోనా ఆంక్షలు లేకపోవడంతో విగ్రహాలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్‌కు తగినట్లుగా విగ్రహాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నా ధరలు మాత్రం చుక్కల్లో ఉన్నాయి. గతంతో పోల్చితే విగ్రహాల ధరలు రెట్టింపయ్యాయని ప్రజలు వాపోతున్నారు. గతంలో 40 వేల రూపాయలకు లభించిన విగ్రహం ప్రస్తుతం 80 వేల రూపాయలకు పెరిగిందని చెబుతున్నారు.
విగ్రహాల తయారీకి ఉపయోగించే ప్లాస్టరాఫ్ ప్యారిస్, రంగులు, ఇతర ముడిసరుకుల ధరలు భారీగా పెరగటమే ఇందుకు ప్రధాన కారణమని విగ్రహాల తయారీదారులు అంటున్నారు. విగ్రహాల తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు, లేబర్ ఖర్చులు, రవాణా ఖర్చులు పెరగినందున విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని తయారీదారులు అంటున్నారు. ధరలు పెరగటం వల్ల భక్తులు చిన్న విగ్రహాలు కోనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. వినాయక ఉత్సవాల ఏర్పాటుకు తక్కువ సమయం ఉండటంతో కొనుగోళ్లు కష్టంగా మారాయని భక్తులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: