ETV Bharat / city

రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ

రాష్ట్రంలో జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపింది.  నాలుగేళ్ల కిందటే రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు పంపగా కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ ఆమోదముద్ర వేసింది. స్థల పరిశీలన కోసం 12, 13 తేదీల్లో కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది.

prestigious medical institution in the telangana
రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ
author img

By

Published : Dec 9, 2019, 6:03 AM IST

తెలంగాణలో మరో ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ ఏర్పాటుకానుంది. రాష్ట్రానికి జాతీయ అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ(ఎన్‌సీడీసీ)ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నాలుగేళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆమోదముద్ర వేసింది. స్థల పరిశీలన కోసం 12, 13 తేదీల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు రానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లలో ఆరోగ్యశాఖ తలమునకలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌సీడీసీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు, మరో 27 కొత్త శాఖలను రాష్ట్రాల్లో నెలకొల్పాలనేది లక్ష్యం.

400 కోట్లు కేటాయించిన ఆర్థిక సంఘం...

ఇందులో భాగంగా 12వ ఆర్థికసంఘం నిధుల్లో కేంద్రం రూ.400 కోట్లు కేటాయించింది. కొత్తగా నెలకొల్పే శాఖలకు సొంత భవనాలు నిర్మించాలని నిర్దేశించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడెకరాల అనువైన స్థలాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా వేర్వేరు చోట్ల స్థల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పటికే నిర్మితమైన భవనం అందుబాటులో ఉంటే త్వరగా కేంద్రం ఏర్పాటు చేసేందుకు వీలవుతుందనే అభిప్రాయాన్ని ఇటీవల కేంద్ర ఉన్నతాధికారులు వ్యక్తపరచడంతో ఉన్నతాధికారులు వ్యూహం మార్చారు. కోఠిలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం ఆవరణలో..గతంలో ఏపీ వైద్యఆరోగ్యశాఖ కార్యకలాపాలు సాగించిన భవనాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అందులో మూడంతస్తుల భవనాన్ని ఎన్‌సీడీసీ కోసం కేటాయించాలని నిర్ణయించారు. అందులో ఒక అంతస్తును ఎన్‌సీడీసీ కార్యాలయ అవసరాలకు, మిగిలిన రెండు అంతస్తుల్లో ప్రయోగశాల, ఇతర సౌకర్యాలను నెలకొల్పేలా ప్రణాళిక రూపొందించారు.

పరిశోధన, శిక్షణ.. బలోపేతం

ఈ భవనంలో ఎన్‌సీడీసీ ఏర్పాటుకు కేంద్ర అధికారులు ఆమోదముద్ర వేస్తే మూడు నెలల లోపే పనులు ప్రారంభమయ్యే అవకాశాలుంటాయని వైద్య వర్గాలు తెలిపాయి. ‘‘ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే గనేరియా, యాస్‌, వైరల్‌ హెపటైటిస్‌, రేబిస్‌, లెప్టోస్పైరోసిస్‌, స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ, జికా వంటి వ్యాధుల నియంత్రణ, నిర్మూలనలో ఎన్‌సీడీసీ కీలకంగా వ్యవహరిస్తుంది. వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు తక్షణమే నిర్ధారణ పరీక్షలు, పరిశోధనలు, సత్వర చర్యలు, అవగాహన, శిక్షణ తదితర కార్యక్రమాల నిర్వహణలోనూ ప్రధాన భూమిక పోషిస్తుంది. కేంద్రం మంజూరైతే దాన్ని నెలకొల్పడానికయ్యే వ్యయంతోపాటు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇతర మానవ వనరుల నియామకాలకయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుంది. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక ప్రయోగశాలను నిర్మిస్తారు. రాష్ట్రంలో అంటువ్యాధులపై నిరంతరం పరిశోధనలు కొనసాగించే అవకాశం దక్కుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చూడండి: ఈటీవీ భారత్​ను వరించిన 'కోయిర్ కేరళ-2019' అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.