ETV Bharat / city

presidential review: నేడే యుద్ధ నౌకల సమీక్ష - విశాఖ ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న రాష్ట్రపతి

President at vishakapatnam: విశాఖలో నేడు నిర్వహించనున్న ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ కోసం.. రాష్ట్రపతి విశాఖపట్నం చేరుకున్నారు. రామ్‌నాథ్‌ కోవింద్​కు.. ఏపీ సీఎం జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఘన స్వాగతం పలికారు.

president of india ap tour
president of india
author img

By

Published : Feb 21, 2022, 5:51 AM IST

Updated : Feb 21, 2022, 6:49 AM IST

President at vishakapatnam: ఏపీలోని విశాఖలో నేడు నిర్వహించనున్న రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (పీఎఫ్‌ఆర్‌)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వాయుసేన ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం, పలువురు మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ ఆదివారం విశాఖ చేరుకుని పీఎఫ్‌ఆర్‌ ఏర్పాట్లను పరిశీలించారు. నౌకాదళ అధికారులతో సమీక్షించారు. ముంబయి, కొచ్చి, అండమాన్‌-నికోబార్‌ నుంచి యుద్ధనౌకలు విశాఖకు వచ్చాయి. యుద్ధనౌకల నుంచి రాష్ట్రపతికి గౌరవ వందనానికి నావికులు సాధన చేశారు.

president of india ap tour
రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న ఏపీ ముఖ్యమంత్రి

విశాఖ సాగరతీరంలో ఆదివారం నిర్వహించిన నమూనా ఫ్లైపాస్ట్‌ విన్యాసాలతో ఒళ్లు గగుర్పొడిచాయి. యుద్ధ విమానాలు వాయువేగంతో ప్రయాణించినప్పుడు వచ్చిన భారీ శబ్దాలతో ఆకాశం హోరెత్తింది. పీఎఫ్‌ఆర్‌లో పాల్గొనే యుద్ధనౌకలను సాగర తీరానికి చేరువగా ఉంచడంతో వాటిని చూసేందుకు బీచ్‌ పరిసరాలకు భారీగా జనం తరలివచ్చారు. ఈ నెల 27న నావల్‌ కోస్టల్‌ బ్యాటరీ నుంచి వైఎంసీఏ వరకు జరిగే ‘అంతర్జాతీయ నగర కవాతు’కు అధికారులు భారీ ఎత్తున సుందరీకరణ కార్యక్రమాలు చేపడుతున్నారు.

.

పాల్గొనే యుద్ధనౌకలు: ఐ.ఎన్‌.ఎస్‌. విశాఖపట్నం, ఐ.ఎన్‌.ఎస్‌. వేలా జలాంతర్గామి, ఐ.ఎన్‌.ఎస్‌. చెన్నై, ఐ.ఎన్‌.ఎస్‌. దిల్లీ, ఐ.ఎన్‌.ఎస్‌. తేజ్‌, శివాలిక్‌ శ్రేణి యుద్ధనౌకలు మూడు, కమోర్తా యుద్ధనౌకలు మూడు, కోస్ట్‌గార్డ్‌, ఎన్‌.ఐ.ఒ.టి., షిప్పింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన నౌకలు పీఎఫ్‌ఆర్‌లో పాల్గొంటున్నాయి.

* చేతక్‌, ఏఎల్‌హెచ్‌., సీకింగ్‌, కమోవ్‌ హెలికాప్టర్లు, డోర్నియర్‌, ఐ.ఎల్‌.-38ఎస్‌.డి., పి8ఐ, హాక్‌, మిగ్‌ 29కే యుద్ధవిమానాలు ఫ్లైపాస్ట్‌లో పాల్గొంటాయి.

ఇదీ చదవండి: CM KCR MUMBAI TOUR: మార్పునకు తరుణమిదే.. భాజపాను చిత్తుగా ఓడించాల్సిందే

Last Updated : Feb 21, 2022, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.