కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి వ్యక్తిగత పరిశుభ్రత ఒక్కటే మార్గం కాదు. ఆహార విషయంలోనూ తప్పక జాగ్రత్తలు అవసరమని హోమియే, ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. జన సందోహం ఉండే ప్రాంతాల్లో మామిడి, వేప ఆకులు ఉంచడం ద్వారా వైరస్‌ను అడ్డుకోవచ్చని తెలిపారు.
ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు ఇంట్లో వండే ఆహారాన్నే తినాలని చెబుతున్నారు. రోజు తీసుకునే ఆహారంలో నట్స్, మాంసం, పండ్లు, పప్పులు, ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి వాటిని అధికంగా తీసుకోవాలని తెలుపుతున్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత, సరైన ఆహారంతో కొంత వరకు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వైద్యులు వెల్లడించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప ఫలితం ఉండదంటున్నారు.
- ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో రక్తానికి కొరత