ETV Bharat / city

కరోనా బారిన పడిన ప్రగ్యా జైస్వాల్.. బాలయ్య అభిమానుల్లో ఆందోళన - tollywood movie news

కంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్‌. ఈ భామ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డింది.

pragya covid
pragya covid
author img

By

Published : Oct 10, 2021, 4:18 PM IST

కంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న్ననలు పొందిన ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్‌. ఈ భామ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది ప్ర‌గ్యా. ఆదివారం జ‌రిపిన క‌రోనా ప‌రీక్షల్లో త‌న‌కు పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలిపింది. తాను రెండు డోసుల టీకా తీసుకున్నా కూడా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు చెప్పింది. ప్ర‌స్తుతం తాను ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని.. గ‌త ప‌ది రోజులుగా త‌న‌ను క‌లిసిన వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరింది. త‌న‌కు క‌రోనా రావ‌డం ఇదే తొలిసారి కాద‌ని.. వ్యాక్సిన్ వేసుకోక ముందు ఓ సారి వ‌చ్చిన‌ట్లు గుర్తుచేసింది.

నందమూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న అఖండ చిత్రంలో ప్ర‌గ్యా న‌టిస్తోంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్నిద్వారకా క్రియేషన్స్ బ్యానర్​పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో దర్శకుడు బోయపాటితో పాటు నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు కూడా పాల్గొనగా బాలయ్య, ప్రగ్యా ఈ పార్టీకి హైలెట్​గా నిలిచారు. బాల‌య్య‌తో క‌లిసి చాలా ఫోటోల‌కు ఫోజులిచ్చింది. తాజాగా ప్రగ్యా కరోనా బారిన పడినట్లు తెలపటం బాల‌య్య అభిమానులకు ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఇదీ సంగతి : Rakul preet singh birthday: ఆ నటుడితో రిలేషన్​లో రకుల్​ప్రీత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.