ETV Bharat / city

Prabhas donates 1crore to AP CM relief fund : సీఎంఆర్​ఎఫ్​కు ప్రభాస్ రూ.కోటి - cm relief fund

డార్లింగ్ ప్రభాస్​ ఆపదలో ఉన్నవారికి సాయమందించడంలో ఉదారత చాటుతున్నాడు. ఇటీవల ఏపీని అతలాకుతలం చేసిన వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. కోటి విరాళంగా ప్రకటించాడు బాహుబలి.

Prabhas donates one crore
Prabhas donates one crore
author img

By

Published : Dec 7, 2021, 1:44 PM IST

Prabhas 1Crore CM Relief Fund: బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్​ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. తర్వాత వచ్చిన 'సాహో'తో మరింత పాపులర్‌ అయ్యాడు. ఫైటింగులు, రొమాన్స్‌ చేస్తూ సినిమాల్లో అలరించటమే కాకుండా ఆపదలో ఉన్నవారికి సాయమందించడంలోనూ ప్రభాస్‌ తన ఉదారత చాటుతున్నాడు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులకు సాయమందించి తన మంచి మనసు చాటుకున్నాడు ప్రభాస్. ఇటీవల ఏపీని వరదలు ముంచెత్తాయి. ఈ విపత్తులో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. కోటి విరాళంగా ప్రకటించాడు ప్రభాస్. దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నాడు. గతంలో కరోనా సమయంలోనూ ఈ పాన్‌ ఇండియా స్టార్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి మరో రూ. 3 కోట్లు ఇచ్చాడు. ప్రస్తుతం 'రాధేశ్యామ్' మూవీతో అభిమానులు, ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు డార్లింగ్‌ ప్రభాస్‌.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.