ETV Bharat / city

సజ్జల నన్ను హత్యచేయించాలని చూస్తున్నారు: జేసీ ప్రభాకర్ - జేసీ ప్రభాకర్ రెడ్డి తాజా వార్తలు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనను హత్యచేయటానికి చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడేందుకే తన ఇంటికి వస్తే... కత్తులు, కొడవళ్లు ఎందుకు తీసుకొచ్చారని జేసీ ప్రశ్నించారు.

prabhakar-reddy-comments-on-sajjala
సజ్జల నన్ను హత్యచేయించాలని చూస్తున్నారు: జేసీ ప్రభాకర్
author img

By

Published : Dec 27, 2020, 11:04 PM IST

సజ్జల నన్ను హత్యచేయించాలని చూస్తున్నారు: జేసీ ప్రభాకర్

వైకాపా నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనను హత్యచేయటానికి చూస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడేందుకే తన ఇంటికి వస్తే.. కత్తులు, కొడవళ్లు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తమ బస్సులకు అన్ని అనుమతులు ఉన్నా ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

"నా తుపాకీ లైసెన్సు ఎందుకు రెన్యువల్ చేయటం లేదో.. జిల్లా ఎస్పీ స్పష్టం చేయాలి. మాపై పోలీసులు పెడుతున్న కేసులకు పై నుంచి ఒత్తడే కారణం. పోలీసులు మారకపోతే రాష్ట్రం నాశనమైపోతుంది. నాకు గన్​మెన్​లను ఎందుకు ఇవ్వటంలేదో ఎస్పీ సమాధానం చెప్పాలి." -జేసీ ప్రభాకర్ రెడ్డి

తమ బస్సులకు ఇప్పుడు కాకపోతే ఏడాది, రెండు సంవత్సరాల తర్వాతైనా పర్మిట్లు వస్తాయని జేసీ ప్రభాకర్ చెప్పారు. తాడిపత్రిలో తన ఇంటికి వైకాపా వర్గీయులు వచ్చిన ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు పెడితే 9 మంది పోలీసులు ఇబ్బంది పడతారని చెప్పారు. పోలీసులు, అన్నిశాఖల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి: దత్తపుత్రికను పెళ్లికూతురిని చేసిన సీఎం కేసీఆర్ సతీమణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.