ETV Bharat / city

అనుకున్న దానికన్నా తగ్గిన విద్యుత్​ డిమాండ్​

విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కరోనాపై పోరుకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేసినా విద్యుత్​కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న జెన్​కో, ట్రాన్స్​కోకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అంచనాకు మించి భారీగా డిమాండ్ పడిపోయినప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరించి బ్యాలెన్స్ చేయగలిగారని సీఎం ప్రసంశించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి విద్యుత్ దీపాలు ఆర్పివేయడం వల్ల 1,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ తగ్గిపోయింది.

అనుకున్న దానికన్నా తగ్గిన విద్యుత్​ డిమాండ్​
అనుకున్న దానికన్నా తగ్గిన విద్యుత్​ డిమాండ్​
author img

By

Published : Apr 6, 2020, 5:55 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ఒకేసారి విద్యుత్ దీపాలు ఆర్పినప్పటికీ, విద్యుత్ శాఖ పక్కా వ్యూహంతో వ్యవహరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఒకే సారి పెద్దమొత్తంలో విద్యుత్ వినియోగంలో మార్పులు సంభవించినప్పటికీ.. ఉత్పత్తి,సరఫరా మధ్య పూర్తి స్థాయి సమతూకం సాధించడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించాయన్నారు. ఆదివారం ఉదయం నుంచి సీఎండీ డి.ప్రభాకర్ రావు విద్యుత్ సౌధలోని లోడ్​ డిస్పాచ్ సెంటర్​లోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ డిమాండ్ ఒకేసారి పడిపోయినప్పుడు అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేశారు. దానికి అనుగుణంగా రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు చాకచక్యంగా వ్యవహరించారు.

5,800 మెగావాట్లకు..

విద్యుత్ దీపాలను ఆర్పిన సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 26వేల మెగావాట్లకు పడిపోయింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 9 గంటల ముందు 7,300 మెగావాట్లు ఉండగా.. 9 గంటల తర్వాత 5,800 మెగావాట్లకు పడిపోయింది. ఎస్పీడీసీఎల్ పరిధిలో 1,100 మెగావాట్లు, ఎన్​పీడీసీఎల్ పరిధిలో 400 మెగావాట్ల డిమాండ్ పడిపోయింది.

పంపుసెట్లు నడిపి..

తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల 300 నుంచి 500 మెగావాట్ల డిమాండ్ పడిపోయే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనా వేసింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల 1500 మెగావాట్ల డిమాండ్ పడిపోయింది. పరిస్థితిని క్షణక్షణానికి పర్యవేక్షిస్తూ తగ్గిన లోడ్​ను బట్టి మరో చోట అదనంగా విద్యుత్ ఖర్చు చేసే వ్యూహం అనుసరించారు. తగ్గిన డిమాండును బ్యాలెన్స్ చేయడం కోసం నాగార్జున సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో, కాళేశ్వరం ప్రాజెక్టులో పంపుసెట్లు నడిపి విద్యుత్ ఖర్చు చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించారు. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరాల మధ్య సమతూకం కుదిరింది.

గ్రిడ్​పై ఎలాంటి ప్రభావం లేదు..

అటు గ్రిడ్​పై ఎలాంటి ప్రభావం కలగలేదు. మరోవైపు 9 గంటల 9 నిమిషాల నుంచి మళ్లీ డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఇతర చోట్ల వినియోగాన్ని తగ్గించుకుని బ్యాలెన్స్ చేశారు. ఫలితంగా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆన్ చేసినా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 62 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.