ETV Bharat / city

ఆ తరగతుల పరీక్షలు వాయిదా... సవరించిన కాలపట్టిక విడుదల - విద్యాశాఖ తాజా సమాచారం

School Exams Time Table: పరీక్షలకు వారం రోజుల ముందుగా 1-9 తరగతుల సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ-2) కాలపట్టిక జారీ చేయడంపై విమర్శలు రావడంతో విద్యాశాఖ వాటిని వాయిదా వేసింది. దాంతో గురువారం ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు రాధారెడ్డి సవరించిన కాలపట్టికను విడుదల చేశారు.

Exams Time Table
Exams Time Table
author img

By

Published : Apr 1, 2022, 10:26 AM IST

School Exams Time Table: పరీక్షలకు కేవలం వారం రోజుల ముందుగా 1-9 తరగతుల సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ-2) కాలపట్టిక జారీ చేయడంపై విమర్శలు రావడంతో విద్యాశాఖ వాటిని వాయిదా వేసింది. ఏప్రిల్‌ 7 నుంచి పరీక్షలు జరుగుతాయని బుధవారం రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) కాలపట్టికను విడుదల చేసింది. దీనిపై ‘పరీక్షలకు వారం ముందు కాలపట్టిక’ అనే శీర్షికన ‘ఈనాడు’లో వార్త ప్రచురితం కావడంతో ప్రభుత్వం ఎస్‌సీఈఆర్‌టీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

కాలపట్టికను జారీ చేయడం ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించినట్లు తెలిసింది. వారం రోజుల్లో ప్రశ్నపత్రాలను ముద్రించి ఎలా పాఠశాలలకు చేరుస్తారు? అని అడిగినట్లు సమాచారం. దాంతో ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు రాధారెడ్డి పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్‌ 16 నుంచి 22 వరకు జరపాలని నిర్ణయించినట్లు గురువారం రాత్రి 10 గంటలకు ప్రకటించారు. ఆ ప్రకారం కాలపట్టికను విడుదల చేశారు. పరీక్షలు ముగిసిన మరుసటి రోజు(23వ తేదీ)న ఫలితాలు వెల్లడించాలి. పాఠశాలలకు ఆరోజే చివరి పనిదినం.

ఇదీ చదవండి:TSRTC Ugadi Offer: ఉగాది సందర్భంగా ఆర్టీసీ బంపర్​ ఆఫర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.