ETV Bharat / city

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు... 20 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ..

Posters questioning BJP: నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో మోదీని ప్రశ్నిస్తూ గోడలపై పోస్టర్​లు దర్శనం ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఎందుకిలా ప్రశ్నించాల్సి వచ్చింది.. ఇంతకీ ఏమిటా ప్రశ్నలు? చూద్దామా..

author img

By

Published : Sep 14, 2022, 2:15 PM IST

Updated : Sep 14, 2022, 2:59 PM IST

Posters
పోస్టర్​లు

Posters questioning BJP: మల్కజ్​గిరి పార్లమెంట్​ పరిధిలోని సికింద్రాబాద్​ కంటోన్మెంట్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో భాజపాకు వ్యతిరేకంగా పోస్టర్​​లు దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. కేంద్రాన్ని, భాజపా పాలనను నిరసిస్తూ కంటోన్మెంట్ యూత్ ఆధ్వర్యంలో గోడలపై పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారో చెప్పాలంటూ 20 ప్రశ్నలతో కూడిన పోస్టర్లను కంటోన్మెంట్ యువత పేరుతో చెక్​పోస్ట్​ వద్ద ఉన్న ప్రహరీలపై అంటించారు. ప్రజా సంగ్రామ యాత్ర పోస్టర్ల పక్కనే మోదీ సమాధానం చెప్పాలంటూ... పోస్టర్లు ప్రత్యక్షమవడంతో అందరూ దీనిపై చర్చించుకుంటున్నారు.

20 ప్రశ్నలతో కూడిన పోస్టర్​
20 ప్రశ్నలతో కూడిన పోస్టర్​

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఐటీఐఆర్, మెడికల్ కళాశాలలు, పసుపు బోర్డు, కంటోన్మెంట్​లో ఓటర్ల తొలగింపు, కంటోన్మెంట్ రహదారులు మూసివేత, ప్రాజెక్టులకు జాతీయ హోదా, జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు, కంటోన్మెంట్ ఎన్నికల అంశం, బయ్యారం గనుల, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాలతో కూడిన పోస్టర్లను పెద్ద ఎత్తున అంటించారు.. వెంటనే వీటిని తెలంగాణ ప్రజలకు అందించి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. పాదయాత్రల పేరుతో ప్రజాసమస్యలు తీరవని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చేందుకే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని రాశారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 14, 2022, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.