2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును రాష్ట్ర సర్కార్ పొడిగించింది. ఈ-పాస్ వెబ్సైట్లో వివరాల నమోదుకు మే నెలాఖరు వరకు నూతన గడువును విధించింది.
ఇప్పటివరకు ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా 2 లక్షల 9వేల 618 మంది విద్యార్థులు కొత్త, రెన్యువల్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. కొన్ని కోర్సుల ప్రవేశాలు ఇంకా పూర్తి కానందున గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త, రెన్యువల్ ఉపకార వేతనాల కోసం కళాశాలలు, విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మే ఆఖరి వరకు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని అన్ని సంక్షేమ శాఖలను రాహుల్ కోరారు.