ETV Bharat / city

RAIN ALERT రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు - తెలంగాణకు వర్ష సూచన

RAIN ALERT ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. ఎల్లుండి కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

RAIN ALERT
RAIN ALERT
author img

By

Published : Aug 14, 2022, 4:35 PM IST

RAIN ALERT: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు పడుతుండటంతో వివిధ పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. రానున్న మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. ఎల్లుండి కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఉత్తర బంగాళా ఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వాయుగుండంగా బలపడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఇది వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ వాయుగుండం రానున్న 6గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.