ETV Bharat / city

Women's Friendship : వారితో స్నేహం.. మానసిక ఒత్తిడికి దూరం.!

ఏ కష్టమొచ్చినా సరే మన స్నేహితులతో పంచుకొని గుండె భారం దించుకుంటాం... మనసు బాగోలేకపోతే మన ప్రాణ స్నేహితురాలికి ఫోన్‌ చేసి కాసేపు మాట్లాడతాం.. ఎలాంటి సహాయం కావాలన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితురాలే! ఇలా మన జీవితంలో స్నేహానిది కీలక పాత్ర! అయితే చాలామంది అమ్మాయిలకు తమ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో అబ్బాయిలున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం అమ్మాయిలతోనే ఎక్కువగా చెలిమిని కొనసాగిస్తుంటారు. వారితోనే అన్ని విషయాలు నిర్మొహమాటంగా పంచుకోగలుగుతారు. ఇదిగో ఇలాంటి వారిలోనే ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత సొంతమవుతుందంటోంది ఓ తాజా అధ్యయనం. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.

Women's Friendship
అమ్మాయిల స్నేహం
author img

By

Published : Aug 1, 2021, 4:44 PM IST

అమ్మాయిలు తోటి అమ్మాయిలతో స్నేహం చేయడం వల్ల ఒత్తిడి దరిచేరకుండా జీవితాంతం హ్యాపీగా ఉండచ్చంటోంది. ‘జర్నల్‌ ఆఫ్‌ విమెన్‌ అండ్‌ ఏజింగ్‌’ అనే పత్రికలో ప్రచురితమైన ఓ అధ్యయనం. స్నేహితురాలే.. మీకు స్ట్రెస్‌బస్టర్‌ అని చెబుతోంది. ఇదనే కాదు.. ఆడవాళ్లు, ఆడవాళ్లతో స్నేహం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం పరంగా ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఈరోజు ‘స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.

ఆడవాళ్లు తోటి ఆడవాళ్లను చూసి ఈర్ష్య పడుతుంటారని అంటుంటారు.. ఇలాంటి అసూయాద్వేషాలే ఇద్దరి మధ్య దూరాన్ని మరింతగా పెంచుతుంటాయని చెబుతుంటారు. కానీ మహిళా స్నేహితుల విషయంలో మాత్రం ఈ భావన అస్సలు కరెక్ట్‌ కాదని చెబుతోంది తాజా అధ్యయనం. ఎందుకంటే ఒకే ఈడు ఆడపిల్లలు స్నేహితులుగా మారడానికి ఇష్టపడతారని, ఇలా ఆడవాళ్లు ఆడవాళ్లతో స్నేహం చేయడం వల్ల వారిలో ఒత్తిడి కలిగించే హార్మోన్‌ స్థాయులు చాలా తక్కువగా విడుదలవుతాయని చెబుతోంది. తద్వారా ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గి సంతోషంగా ఉండగలుగుతారంటోంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకునే క్రమంలో వారి సమస్యలు పరిష్కారమవడంతో పాటు ఇద్దరి మధ్య సఖ్యత కూడా మరింతగా పెరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు.

స్వీయ ప్రేమ పెరుగుతుంది!

చాలామంది అమ్మాయిలు తమ ఈడు అమ్మాయిలతోనే స్నేహం చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తుంటారు. కాలేజీలో ఏదైనా ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్నా కలిసే ఆ పని పూర్తిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక వేసుకునే దుస్తులు, చేసుకునే మేకప్‌.. ఏదైతే తన నెచ్చెలికి సరిపోతుందో స్నేహితురాలికి తప్ప మరెవరికి తెలుస్తుంది చెప్పండి. ఈ క్రమంలో తనకు తెలిసిన మెలకువలు, టిప్స్‌ చెప్పి.. ఓవరాల్‌గా తన ఫ్రెండ్‌ని ఓ ఫ్యాషన్‌ క్వీన్‌లా/బ్యూటీ క్వీన్‌లా మార్చేస్తుందనుకోండి. అంతేకాదు.. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. పొరపాట్లను నిర్మొహమాటంగా చెప్పడంలోనూ గర్ల్‌ఫ్రెండ్స్‌ ముందే ఉంటారంటున్నారు నిపుణులు. ఇలా ఒకరినొకరు ప్రోత్సహించుకునే క్రమంలో ఇద్దరిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. తమను తాము ప్రేమించుకోవడానికి కావాల్సింది ఇదే కదా మరి! అందుకే ఆడవాళ్ల స్నేహాలు వారిలో స్వీయ ప్రేమ పెరిగేలా చేస్తాయని ఊరికే అనలేదు.

మీరెప్పుడూ ‘ఒంటరి’ కారు!

కుటుంబ సమస్యలున్నా.. వ్యక్తిగతంగా సవాళ్లు ఎదురైనా, భర్త-అత్తమామల నుంచి వేధింపులు ఎదురైనా తీవ్ర మనోవేదనకు గురవుతుంటాం.. ఎవరితో పంచుకోవాలో అర్థం కాక సతమతమైపోతుంటాం.. ఎందుకంటే ఇంట్లో వాళ్లతో పంచుకున్నా, ఇంకెవరితో చెప్పినా, తప్పు అవతలి వారిదైనా.. మనల్నే సర్దుకుపొమ్మని చెప్పడం చాలామంది విషయంలో మనం చూస్తుంటాం.. ఇలాంటివి మనలో కొంతమందికి అనుభవమయ్యే ఉంటాయి కూడా!

కానీ స్నేహితురాలు మాత్రం అలా చేయదు.. తనకూ ఇలాంటి కష్టాలు కొత్త కాదు.. కాబట్టి మన సమస్యల్ని తను అర్థం చేసుకుంటుంది.. తన స్నేహితురాలి ఆవేదనను పూర్తిగా తెలుసుకొని సరైన సలహా ఇవ్వడంలోనూ తను ముందే ఉంటుంది. ఈ క్రమంలో తప్పు మీదైతే మిమ్మల్ని మందలించడానికీ వెనకాడదు. ఒకవేళ పొరపాటు మీది కాకపోయినా మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా దాన్నుంచి మీరెలా బయటపడాలో సలహాలివ్వడానికీ ముందే ఉంటుందామె. ఇలా అన్ని వైపుల నుంచి స్నేహితురాలి సపోర్ట్‌ ఉన్న వారు ఎప్పటికీ ఒంటరి కారు అని చెబుతున్నారు నిపుణులు.

ఎప్పుడూ మంచే కోరుకుంటుంది!

అందరిలా కాకుండా కొత్తగా ఏదైనా చేయాలనుకున్నా.. లేదంటే ఏదైనా ఆట పట్ల ఆసక్తి చూపినా.. ఈ విషయం మన పేరెంట్స్‌కి చెప్తే ఏమంటారు? ‘ముందు చదువుపై శ్రద్ధ పెట్టు... భవిష్యత్తులో అదే నీకు అన్నం పెడుతుంది!’.. అని! చాలామంది తల్లిదండ్రుల దగ్గర్నుంచి ఇదే సమాధానం వస్తుంది. దాంతో ఎక్కడలేని అసహనం మనలో ఆవహిస్తుంది. అదే మీకున్న అభిరుచి గురించి మీ స్నేహితురాలితో చెప్పి చూడండి.. తప్పకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అందులో మీరు రాణించాలని మనసారా కోరుకుంటుంది.. ఆ దిశగా తన పరిచయస్తుల సహాయం తీసుకోవడం, మీ అభివృద్ధి కోసం సలహాలివ్వడం.. చేస్తుంది. ఇక మరో అడుగు ముందుకేసి ఈ విషయంలో మీ తల్లిదండ్రుల్ని ఒప్పించే ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. నిజంగా ఇలా తానిచ్చే ప్రోత్సాహం మనకు బూస్టర్‌ డోస్‌లా ఉపయోగపడడమే కాదు.. తను నా వెంటే ఉందన్న ధైర్యం, మానసిక ఉల్లాసం.. రెండూ సొంతమవుతాయి.

స్నేహంతో ఏదైనా జయించచ్చు!

మన జీవితంలో జరిగే కొన్ని ప్రతికూల సంఘటనలు మన మానసిక ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా విడాకులు/బ్రేకప్‌, ఆప్తుల్ని కోల్పోవడం, కుటుంబ సమస్యలు, గృహ హింస, ఉద్యోగం కోల్పోవడం.. ఇలాంటి సమస్యలు మనసు మీద చాలా కాలం పాటు ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటిలో కూరుకుపోతే డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. అయితే ఇలాంటి ప్రతికూలతల్ని పంచుకోవడానికి ఓ స్నేహితురాలు తోడుంటే.. చాలావరకు వీటిని అధిగమించచ్చని ఓ పరిశోధన చెబుతోంది. ఇలాంటి సమస్యలతో బాధపడిన కొంతమంది.. తమ స్నేహితురాలి అండతోనే వీటి నుంచి బయటపడినట్లు ఈ అధ్యయనంలో భాగంగా చెప్పుకొచ్చారు. ఇలా మన సమస్యల్ని తనవిగా భావించి.. వాటికి పరిష్కారం చూపడంలో ఫ్రెండ్‌ ఎప్పుడూ వెన్నంటే నిలుస్తుంది.. మరి, అలాంటి స్నేహితురాలు ఉన్నప్పుడు మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి?!

ఇవన్నీ చదువుతుంటే.. మీ స్నేహితురాలు మీకు మానసికంగా అండగా నిలబడిన సందర్భాలు గుర్తొస్తున్నాయా? అయితే ఆ అనుభవాలేంటో మాతో పంచుకోండి.. మీ జీవితంలో అలాంటి అమూల్యమైన స్నేహాల్ని, స్నేహితురాళ్లను తలచుకుంటూ, వారితో సరదాగా గడుపుతూ.. ఈ స్నేహితుల దినోత్సవాన ఎన్నో మధురానుభూతులు మూటగట్టుకోండి..!

ఇవీ చూడండి:

FRIENDSHIP DAY: మీ జీవితంలో అలాంటి ఫ్రెండ్స్​ ఉన్నారా.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.