AP Cabinet Portfolios: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు కొలువుదీరారు. 25 మంది మంత్రులతో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త మంత్రలకు ప్రభుత్వం శాఖలను కేటాయించింది. ఈసారి కూడా ఐదురురికి ఉప ముఖ్యమంత్రుల పదవులను కట్టబెట్టింది. వారిలో రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, కొత్తు సత్యనారాయణ, నారాయణస్వామి ఉన్నారు.
మంత్రులకు కేటాయించిన శాఖలు
- ధర్మాన ప్రసాదరావు - రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
- సీదిరి అప్పలరాజు - పశుసంవర్ధక, మత్స్యశాఖ
- దాడిశెట్టి రాజా - రహదారులు, భవనాలశాఖ
- గుడివాడ అమర్నాథ్ - పరిశ్రమలు, ఐటీ శాఖ
- వేణుగోపాల్ - బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాలు
- తానేటి వనిత - హోంశాఖ
- జోగి రమేష్ - గృహనిర్మాణ శాఖ
- కారుమూరి నాగేశ్వరరావు - పౌరసరఫరాలశాఖ
- మేరుగ నాగార్జున - సాంఘిక సంక్షేమశాఖ
- విడదల రజని - వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
- కొట్టు సత్యనారాయణ - దేవదాయశాఖ
- బొత్స సత్యనారాయణ - విద్యాశాఖ
- అంబటి రాంబాబు - జలవనరుల శాఖ
- ఆదిమూలపు సురేశ్ - పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
- కాకాణి గోవర్ధన్ రెడ్డి - వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - గనులు, అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ
- ఆర్.కె.రోజా - పర్యాటక, యువజన, క్రీడల శాఖ
- కె.నారాయణ స్వామి - ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ
- అంజాద్ బాషా - ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమశాఖ
- బుగ్గన - ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, ప్రణాళిక శాఖ
- గుమ్మనూరు జయరాం - కార్మిక శాఖ
- ఉషశ్రీ చరణ్ - మహిళా శిశుసంక్షేమశాఖ
- బూడి ముత్యాలనాయుడు-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
- రాజన్నదొర – ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ
- పినిపే విశ్వరూప్ - రవాణాశాఖ
ఇదీ చదవండి : కొలువుదీరిన సీఎం జగన్ కొత్త టీం..