ETV Bharat / city

శ్రీశైలం టైగర్‌ రిజర్వులో పెరిగిన పెద్దపులుల సంఖ్య - News of large tiger population in Nagarjunasagar-Srisailam Tiger Reserve

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్‌ రిజర్వులో పెద్దపులుల సంఖ్య పెరిగిందని ఏపీలోని కర్నూలు-కడప జిల్లాల అటవీ సంరక్షణాధికారి రామకృష్ణ తెలిపారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 30 వరకు గుండ్లబ్రహ్మేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో శాస్త్రీయ గణన చేపట్టనున్నట్లు వెల్లడించారు. నాలుగో విడత పర్యవేక్షణ, ట్రాప్‌ కెమెరాల పనితీరుపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

population-of-tigers-increased-in-nagarjuna-sagar-srishailam-tiger-reserve
శ్రీశైలం టైగర్‌ రిజర్వులో పెరిగిన పెద్దపులుల సంఖ్య
author img

By

Published : Feb 20, 2021, 10:22 AM IST

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్‌ రిజర్వు (ఎన్‌ఎస్‌టీఆర్‌) లో 2018లో బ్లాక్‌-1లో 46 ఉన్న పెద్దపులుల సంఖ్య.. ప్రస్తుతం 63కు పెరిగిందని ఏపీలోని కర్నూలు-కడప జిల్లాల అటవీ సంరక్షణాధికారి రామకృష్ణ వెల్లడించారు.

కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం పచ్చర్ల పర్యాటక విడిది కేంద్రంలో నాలుగో విడత పర్యవేక్షణ, ట్రాప్‌ కెమెరాల పనితీరుపై కింది స్థాయి సిబ్బంది, అటవీశాఖ అధికారులకు శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌టీఆర్‌లోని ఉన్న గుండ్లబ్రహ్మేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ట్రాప్‌ కెమెరాల ద్వారా శాస్త్రీయ గణన చేపట్టనున్నట్లు చెప్పారు. పులుల గణనకు కెమెరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

ఇదీ చదవండి: ఉత్తమ అగ్రిటెక్ స్టార్టప్​గా ఇంటెల్లో ల్యాబ్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.