ETV Bharat / city

దీపావళికి మోగిన టపాసులు.. గతేడాది పోలిస్తే తగ్గిన కాలుష్యం

రాష్ట్రంలో ఈ ఏడాది దీపావళి పండుగ రోజున భారీగా టపాసులు కాల్చారు. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి నాడు స్వల్పంగా కాలుష్యం పెరిగినట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే మాత్రం భారీగా తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

pollution increased on Diwali due to crackers in 2020
దీపావళికి మోగిన టపాసులు
author img

By

Published : Nov 17, 2020, 9:37 AM IST

తెలంగాణలో ఈ ఏడాది దీపావళికి భారీగా టపాసులు పేలాయి. గతేడాది పోలిస్తే తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నా.. ఈ సంవత్సరం స్వల్పంగా కాలుష్యం పెరిగినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలతో టీఎస్​పీసీబీ అధికారులు.. దీపావళి కంటే వారం ముందు కాలుష్య తీవ్రతను లెక్కించారు. ఈ సగటును దీపావళి రోజున నమోదైన గణంకాలతో పోల్చారు. సాధారణ రోజులతో పోలిస్తే స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసే అతి సూక్ష్మధూళికణాలు పీఎం 2.5 ఘనపు మీటరు గాలిలో 13 మైక్రోగ్రాములు, సూక్ష్మధూళి కణాలు (పీఎం 10) 9 ఎంజీలు, సల్ఫర్ డై ఆక్సైడ్ 1.6 ఎజీలు, నైట్రోజన్ ఆక్సైడ్ 2.4 ఎంజీలు పెరిగినట్లు తేలింది.

గతేడాది దీపావళితో పోలిస్తే ఈ ఏడాది వాయు కాలుష్యం తగ్గింది. 2019లో పండుగ రోజున పీఎం 2.5 ఘనపు మీటరు గాలిలో 72 ఎంజీలుండగా.. ఈసారి 64 ఎంజీలకు తగ్గింది. పీఎం 10..ఈసారి 128 ఎంజీగానే నమోదైంది. నైట్రోజన్‌ ఆక్సైడ్‌ తగ్గింది. సల్ఫర్‌ డయాక్సైడ్‌ మాత్రం 6 ఎంజీల నుంచి ఈసారి 8.4 ఎంజీలకు పెరిగింది.

శబ్ద కాలుష్యంపై 10 ప్రాంతాల్లో అధ్యయనం చేసిన అధికారులు.. నాలుగు కేటగిరీలు పారిశ్రామిక, సున్నిత, వాణిజ్య, నివాసితగా వర్గీకరించారు. పగటిపూట శబ్ద తీవ్రత నవంబరు 9 తో పోలిస్తే పండగ రోజు తక్కువగా నమోదయింది. రాత్రిపూట నివాసిత ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాల్లో మోత మోగింది. పారిశ్రామిక ప్రాంతాల్లో మార్పు లేనప్పటికీ.. సున్నిత ప్రాంతాల్లో భారీగా తగ్గింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.