జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తుది పోలింగ్ వివరాలను ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. 149 డివిజన్లలో నిర్వహించిన పోలింగ్‌లో 46.55 శాతం ఓటింగ్ నమోదైనట్టు వెల్లడించారు. ఆర్సీ పురంలో అత్యధికంగా 67.71శాతం, అత్యల్పంగా యూసుఫ్‌గూడలో 32.99 శాతం పోలింగ్ నమోదైనట్టు వివరించారు. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2016లో 45.27శాతంగా నమోదైంది.
ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో గుర్తు తారుమారైనందున... పోలింగ్‌ను గురువారానికి వాయిదా వేశారు. రీపోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రీపోలింగ్ దృష్ట్యా రేపు ఓల్డ్ మలక్‌పేట పరిధిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు, విద్యా, వ్యాపార సంస్థలకు సెలవు అమలు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 4 చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా... సర్కిళ్ల వారీగా 30 మంది పరిశీలకులను నియమించారు.
ఇదీ చూడండి: గ్రేటర్ పోరు: మేయర్ పీఠం దక్కేదెవరికి... క్షణక్షణం అప్డేట్స్ మీకోసం