జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2016లో 45.29 శాతం నమోదు కాగా... తాజా ఎన్నికల్లో 1.28 శాతం పెరిగి 46.55గా నమోదైంది. మూడు డివిజన్లలో అరవై శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా... 36 డివిజన్లలో యాభై నుంచి అరవైశాతం ఓటింగ్ జరిగింది.
94 డివిజన్లలో నలభై నుంచి యాభై శాతం పోలింగ్ నమోదైంది. 16 డివిజన్లలో ముప్పై నుంచి నలభై శాతం ఓటింగ్ జరిగింది. 2016లో యాభై శాతానికి పైగా 27 డివిజన్లలో పోలింగ్ కాగా... 99 డివిజన్లలో నలభై నుంచి యాభై శాతం నమోదైంది. ముప్ఫై నుంచి నలభై శాతం ఓటింగ్ 24 డివిజన్లలో జరిగింది.
తాజా ఎన్నికల్లో...
డివిజన్ | 2016 | 2020 |
ఆర్సీపురం | 58.30 | 67.71 |
యూసుఫ్‌గూడ | 35.92 | 32.99 |
ఎర్రగడ్డ | 59.16 | 43.29 |
విజయ్‌నగర్ కాలనీ | 33.98 | 37.90 |
ఇదీ చూడండి: గ్రేటర్లో 46.55శాతం.. ఓల్డ్ మలక్‌పేటలో రేపు రీపోలింగ్