రాజకీయ జోక్యం వలన భూ సంస్కరణలు అమలు కావడం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరామ్ ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వీఆర్వోల నుంచి రికార్డులను స్వాధీనపరచుకున్నంత మాత్రాన సమస్యలు పరిష్కరించబడవని కోదండరామ్ అన్నారు. భూ సమస్యలు వీఆర్ఓల వల్ల వస్తున్నట్లుగా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసేందుకు.. ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును ప్రవేశపెడుతోందని తెలిపారు. గోదావరి వరద కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : అసెంబ్లీలో గొంతు నొక్కుతున్నారు.. సమయం ఇవ్వాలన్న రాజాసింగ్