హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. మొదటిసారి వచ్చిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.
ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డితోపాటు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్తు పాల్గొన్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో తప్ప... ఆ తర్వాత ఏ ఒక్కరు బయటకు వచ్చినా కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అత్యవసరమై వస్తే... మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు