ETV Bharat / city

పోలీసుల అదుపులో ఎంపీ రేవంత్​రెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత

ఎంపీ రేవంత్​రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియాను వెంటపెట్టుకొని వచ్చిన రేవంత్‌రెడ్డి... జన్వాడ గ్రామం వద్ద 111 జీవోకు వ్యతిరేకంగా కేటీఆర్ భవనాలు నిర్మిస్తున్నారంటూ చూపే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

ravanth reddy
రామచంద్రపురం పోలీస్​స్టేషన్​కు రేవంత్​రెడ్డి
author img

By

Published : Mar 2, 2020, 8:28 PM IST

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం జన్వాడ గ్రామం వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన్వాడ గ్రామం వద్ద 111 జీవోకు వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్​ ఫాంహౌస్​ నిర్మిస్తున్నారని ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. జన్వాడ గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న ఫామ్​ హౌస్​ను మీడియాకు చూపించారు.

ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్​రెడ్డిలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రపురం పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకొంది. పోలీసుల తీరుపై రేవంత్​రెడ్డి, విశ్వేశ్వర్​రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామచంద్రపురం పోలీస్​స్టేషన్​కు రేవంత్​రెడ్డి

ఇవీచూడండి: భారత్​లో కరోనా కలకలం- మరో రెండు కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.