Police Restrictions On Amaravati Farmers Padayatra: ఆంధ్రప్రదేశ్ గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. కంకిపాడు మండలం దాములూరు టోల్‌గేట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు ఉన్న రైతులనే మాత్రమే పాదయాత్రకు అనుమతిస్తున్నారు. ఐడీ కార్డులు లేని వారిని అనుమతించటం లేదు. ఐడీ కార్డులు లేని కారణంగా కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐడీ కార్డులు లేవంటూ కంకిపాడు పీఎస్‌కు 20మంది రైతులను తరలించారు. ఐడీ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తికాకముందే అడ్డుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వదం చోటుచేసుకుంది.
ఇవీ చదవండి: ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
కశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర.. 73ఏళ్ల వ్యక్తి ప్రయాణం.. వెయ్యి కి.మీ పూర్తి