ETV Bharat / city

POLICE RECRUITMENT: 14 వేల ఖాళీలు.. 450 పోస్టులు మాత్రమే భర్తీ

author img

By

Published : Jul 5, 2021, 10:20 AM IST

ఏపీ పోలీసుశాఖలో మెుత్తం 14 వేల ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 450 పోస్టులే భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగులు తీవ్రనిరాశకు గురయ్యారు. జాబ్‌ క్యాలెండర్‌లో ప్రభుత్వం ప్రకటన చూసి ఔత్సాహిత యువత నిరుత్సాహానికి లోనయ్యారు.

ap police recruitment
ఏపీ పోలీసు పోస్టుల భర్తీ

ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం ఆశగా ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. ఖాళీలు వేలల్లో ఉన్నా.. 450 పోస్టులే భర్తీచేయనున్నట్లు జాబ్‌ క్యాలెండర్‌లో ప్రభుత్వం పేర్కొనటం వారిని విస్మయానికి గురిచేసింది. భారీగా పోలీసు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వాటి కోసం సిద్ధమవుతున్న ఆశావహులు.. జాబ్‌ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య చూసి నిరుత్సాహానికి లోనయ్యారు.

‘ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నాం. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందా..? అని గత రెండేళ్లుగా నిరీక్షిస్తున్నాం. ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో ఇప్పుడు తెలుసు. కానీ నామమాత్రంగానే పోస్టులు భర్తీ చేస్తుండటం వల్ల మేము ఆశించిన ప్రయోజనం నెరవేరే అవకాశం లేకుండా పోయింది’ అని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసు శాఖలో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే పనిభారం, ఒత్తిడి అధికమవుతోంది. ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడంతో వారాంతపు సెలవు విధానం అమలుపైనా ప్రభావం పడుతోంది.

12,384 ఖాళీలున్నట్లు ప్రకటన..

ఏపీలో పోలీసు ఉద్యోగాలకు చివరిసారిగా 2018 నవంబరు, డిసెంబరుల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అప్పట్లో 334 ఎస్సై స్థాయి పోస్టులు, 2,723 కానిస్టేబుల్‌ స్థాయి పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 12,384 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వాటిని భర్తీచేస్తే వారాంతపు సెలవుల విధానం అమలుకు వీలవుతుందని.. 2019 జూన్‌లో ప్రభుత్వానికి నివేదించారు.

ఉన్న సిబ్బందిపైనే పని భారం..

పోలీసు ఉద్యోగాల్లో ఖాళీల వల్ల ఉన్నవారిపైనే అదనపు పనిభారం, ఒత్తిడి పడుతోంది. కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకూ అందరికీ వారాంతపు సెలవు విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు 2019 జూన్‌ 19న ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. కొన్నాళ్లు అది బాగానే అమలైంది. అయితే 15వేల మందికి పైగా సిబ్బంది కరోనా బారిన పడటం, లాక్‌డౌన్‌, ఎన్నికల విధులు, కరోనా నియంత్రణ కర్ఫ్యూ విధుల వల్ల వారాంతపు సెలవు అమలు నిలిచిపోయింది. ఇది పూర్తిస్థాయిలో, మరింత మెరుగ్గా అమలు కావాలంటేఅదనపు సిబ్బంది అవసరం.

పోలీసు ఉద్యోగాల ఖాళీలిలా..

  • 2019లో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న ఖాళీలు: 12,384
  • తాజాగా విడుదలైన పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) గణాంకాల ప్రకారం ఉన్న ఖాళీలు: 14,341 (2020 జనవరి 1 నాటికి)
  • వారాంతపు సెలవుల విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలంటే కావాల్సిన అదనపు సిబ్బంది: దాదాపు 8,000 మంది అని పోలీసు శాఖ అంతర్గత అంచనా
  • ఈ లెక్కన మొత్తం భర్తీచేయాల్సిన ఖాళీలు: 20,384

కింద నుంచి రెండో స్థానం..

  • దేశంలో ప్రతి లక్ష జనాభాకు అతి తక్కువ మంది పోలీసులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీది రెండో స్థానం. మనకంటే అతి తక్కువగా బిహార్‌లో ప్రతి లక్ష జనాభాకు 76.20 మంది పోలీసులు ఉన్నారు.
  • అరుణాచల్‌ప్రదేశ్‌ (14.98 మంది), రాజస్థాన్‌ (27.85 మంది), మధ్యప్రదేశ్‌ (32.28 మంది) తర్వాత ప్రతి 100 చ.కి.మీ విస్తీర్ణానికి అతి తక్కువ మంది పోలీసులు ఉన్నది ఏపీలోనే.

ఆశావహులు అయిదు లక్షల మంది పైనే..

  • పోలీసు శాఖలో ఎస్సై స్థాయి ఉద్యోగాలకు డిగ్రీ, కానిస్టేబుల్‌ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌ అర్హత చాలు. అందుకే ఈ పోస్టులకు సన్నద్ధమయ్యేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.
  • ఏపీలో చివరిసారిగా విడుదలైన నోటిఫికేషన్‌లోని పోస్టుల కోసం 5 లక్షల మందికి పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 334 ఎస్సై పోస్టులకు 1,35,414 మంది, 2,723 కానిస్టేబుల్‌ పోస్టులకు 3,94,387 మంది పోటీపడ్డారు.
  • ఈసారీ దాదాపు అంతేస్థాయిలో అభ్యర్థులు ఎదురుచూశారు. అయితే 450 పోస్టులే భర్తీ చేయనుండటంతో వారిలో నిరుత్సాహం వ్యక్తమవుతోంది.

మానవత్వంతో ఆలోచించకపోతే ఎలా..?

"పిల్లలతో ఉన్నవారికి వారంలో ఒక్క రోజైనా సెలవు లేకపోతే ఎలా? వాళ్లు పిల్లలతో ఇంకెప్పుడు గడుపుతారు? కొంచెమైనా మానవత్వంతో ఆలోచించకపోతే ఎలా? 365 రోజులూ విధి నిర్వహణలోనే ఉంటే కుటుంబం మంచి చెడ్డల పరిస్థితేంటి? మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారంలో ఒక రోజు పోలీసులకు కచ్చితంగా సెలవు ఇస్తాం."

- ప్రజా సంకల్ప యాత్రలో 2018 అక్టోబరు 3న విజయనగరం జిల్లా కొండవెలగాడలో కలిసిన కానిస్టేబుళ్లతో జగన్‌

ఏటా 6,500 కొలువుల భర్తీ..

"రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం. డిసెంబరులో ఖాళీల్ని గుర్తించి జనవరిలో నియామక షెడ్యూలు విడుదల చేస్తాం. ప్రస్తుతమున్న ఖాళీలతో పాటు, వారాంతపు సెలవు విధానానికి కావాల్సిన అదనపు సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ చేపడతాం."

- 2020 అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ చేసిన ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.