హైదరాబాద్‌లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ ఆవరణలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అవినీతి నిరోధక శాఖ డీజీ పూర్ణచంద్రరావు, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, శాంతి భధ్రతల అదనపు డీజీ జితేందర్‌తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలీసు సిబ్బందికి డీజీపీ మహేందర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువై... మన్ననలు పొందాలని డీజీపీ ఆకాంక్షించారు.