విల్లా యజమానిని బెదిరించిన కేసులో వైకాపా నేత, వ్యాపారవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ను బంజారాహిల్స్ పోలీసులు సుమారు 11 గంటల పాటు విచారించారు. తన అనుచరులతో కలిసి పీవీపీ బెదిరించినట్టు విల్లా యజమాని విక్రమ్ కైలాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పీవీపీతో పాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు పీవీపీని పోలీసులు విచారించారు. గురువారం మరోసారి విచారణకు హాజరు కావాలని 41 సీఆర్పీసీ కింద నోటీసులు అందజేశారు. గురువారం ఉదయం పోలీసుల ఎదుట మరోసారి పీవీపీ హాజరు కానున్నారు.
ఇవీచూడండి: 'పీవీపీ విల్లాస్‌లో నిర్మాణాలు అడ్డుకునే అధికారం అతనికి లేదు'