HOLI Restrictions: హైదరాబాద్ జంటనగరాల పరిధిలో హోలీ వేడుకల సందర్భంగా పోలీసులు 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. రాష్ట్ర రాజధాని పరిధిలో హోలీ రోజు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
వైన్ షాపుల వద్ద బారులు...
నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయనే విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మందు బాబులు వైన్ షాపుల వద్ద బారులు తీరారు. దీంతో నగరంలోని వైన్ షాపులన్నీ మద్యం ప్రియులతో కిటకిటలాడుతున్నాయి.
ఇదీ చదవండి:చెత్త పన్ను కట్టలేదని నగరపాలక సిబ్బంది 'చెత్త' పని చేశారు!