హైదరాబాద్‌కు వస్తున్న మాదకద్రవ్యాల కట్టడిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ముంబయి, వైజాగ్, గోవా నుంచి డ్రగ్స్ ఎవరు తీసుకువస్తున్నారన్న అంశంపై పరిశోధిస్తున్నారు. లక్ష్మీపతి ద్వారా వైజాగ్ గంజాయి నెట్‌వర్క్‌ను తెలుసుకున్న పోలీసులు అతడితోపాటు ఇంకా ఎంతమందికి గంజాయి సరఫరా అవుతోందన్న సమాచారాన్ని సేకరించారు. ముంబయిలో టోనీ, గోవాలో నికోలస్ రోటిమీ హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారని గుర్తించారు. 2 నెలల్లో 30 మంది డ్రగ్స్ సరఫరాదారులను హైదరాబాద్ మాదకద్రవ్యాల నిఘా విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. మరో రెండువారాల్లో మాదక ద్రవ్యాల సరఫరా గొలుసు (సప్లై లింక్)ను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.
పునరావాస కేంద్రాల వివరాలతో..
మాదకద్రవ్యాలకు బానిసైన వారు నిఘా పెరిగడంతో ప్రస్తుతం అవి దొరక్క పిచ్చిపట్టినట్టు ప్రవరిస్తున్నారు. ఆ వ్యసనం నుంచి వారిని కాపాడేందుకు వారి తల్లిదండ్రులు పునరావాస, డీ-అడిక్షన్ కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డీ-అడిక్షన్ కేంద్రాలున్నా వాతావరణంలో మార్పులుండాలన్న భావనతో ఆంధ్రప్రదేశ్‌లో హార్స్‌లీహిల్స్, గుంటూరు, కర్నూలు, బెంగళూరు, మైసూరు, ఊటీ, కోయంబత్తూరు, కోచి, త్రివేండ్రం ప్రాంతాల్లోని ప్రకృతి ఆశ్రమాలు, పునరావాస కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. పునరావాస కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు పోలీస్ అధికారులు సేకరిస్తున్నారు. ఎవరు వారికి డ్రగ్స్ ఇచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారన్న అంశాలను కూపీ లాగుతున్నారు.
ఇవీ చూడండి: