ETV Bharat / city

TS Police on Rains: ఇళ్లలోనే ఉండండి... అత్యవసరమైతే 100కి కాల్ చేయండి - హైదరాబాద్​ పోలీసులు

police
police
author img

By

Published : Sep 27, 2021, 1:46 PM IST

Updated : Sep 27, 2021, 2:23 PM IST

11:24 September 27

అత్యవసరమయితేనే బయటికి రండి: పోలీసుశాఖ హెచ్చరిక

రెండు రోజుల పాటు భారీ వర్షాలు (heavy rains in telangana) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ( Department of Meteorology )హెచ్చరికలతో పోలీసు శాఖ (ts police) అప్రమత్తమయింది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ (hyderabad cp anjani kumar)... ఉన్నతాధికారులు, సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  

భాగ్యనగర ప్రజలు... అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసు శాఖ  (police department) హెచ్చరిక జారీ చేసింది. ఎలాంటి సమస్య ఉన్న డయల్ 100కి (dial 100) లేదా స్థానిక పోలీసులకు గానీ, పెట్రోలింగ్ సిబ్బందికి గానీ సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. లా అండ్ అర్డర్​ (law and order) ట్రాఫిక్​తో పాటు పలువురు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని వెల్లడించారు. నీరు నిలిచే ప్రాంతాలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి ప్రవాహాలు దాటేందుకు ప్రయత్నించొద్దని తెలిపారు.

వర్షాలపై మేయర్​ సమీక్ష

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల వచ్చిన ఫిర్యాదులు, సహాయకచర్యల వివరాలపై మేయర్ ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో 175 జీహెచ్ఎంసీ బృందాలు ఉన్నాయని పేర్కొన్నారు.  200కు పైగా వాటర్ పంపులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. చెట్లు విరగడం, నీటి నిల్వ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. ప్రజలు హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని పునరావాసాలకు తరలిస్తున్నామన్నారు.  ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

ఇదీ చూడండి: Heavy Rain in Telangana 2021 : బీ అలర్ట్... వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక!

Last Updated : Sep 27, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.