రాష్ట్రంలో లాక్‌డౌన్ సంపూర్ణంగా కొనసాగుతోంది. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చేవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నారు. జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద పోలీసులు విధులు నిర్వర్తిస్తూ... వచ్చే వాహనాలను తనిఖీ చేసి అత్యవసరమైతేనే పంపుతున్నారు. అంబర్‌పేట్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, మియాపూర్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లన్నీ బోసిపోయాయి.
వాహనాలపై రాకపోకలు సాగించే వారిని కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. సరైన కారణాలు లేకుండా రోడ్లపైకి వచ్చేవారిని మందలించి వెనక్కి పంపిస్తున్నారు.
మరోవైపు పొట్టకూటి కోసం ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చిన కూలీలు కాలినడకన సొంతూరు బాట పట్టారు. లాక్‌డౌన్, కర్ఫ్యూ నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కాలినడకన వెళ్తున్నట్టు వలస కూలీలు చెబుతున్నారు. ఇదిలాఉండగా అర్ధరాత్రి అయినప్పటికీ జీహెచ్‌ఎంసీ సిబ్బంది పలు ప్రాంతాల్లో రసాయనాలు చల్లుతూ కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండ: 'అమెరికాలో లక్ష మందికిపైగా కరోనాకు బలవుతారు'