ETV Bharat / city

Thieves robbing in locked houses: పగలు రెక్కీ.. రాత్రిళ్లు దోపిడీలు.. తాళం వేసిన ఇళ్లే లక్ష్యం! - ap latest news

Thieves robbing in locked houses arrested: మధ్యప్రదేశ్ నుంచి రావటం.. దోచుకుని దర్జాగా వెళ్లటం వారి స్టైల్. పగలు రెక్కీ నిర్వహించి.. రాత్రిళ్లు దోపిడీలు చేయటం వారికి చాలా ఈజీ. కేవలం తాళం వేసి ఉన్న ఇళ్లే.. ఆ దోపిడీ దొంగల లక్ష్యం. అసలు ఈ గ్యాంగ్ ఎక్కడుంటుంది.. ఎవరి సహకారంతో ఇదంతా నడుస్తోంది..? అనే విషయాలపై నిఘా పెట్టిన పోలీసులు.. చివరికి ఆ దొంగలను అరెస్ట్ చేశారు.

Thieves robbing in locked houses
Thieves robbing in locked houses
author img

By

Published : Jan 21, 2022, 10:15 PM IST

Thieves robbing in locked houses arrested: ఏపీలోని విజయవాడలో పలు ప్రాంతాల్లో.. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనం చేసిన కేడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉంచిన ఎల్​హెచ్ఎంఎస్ ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు.. మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని ఇండోర్​కు ప్రత్యేక బృందాలను పంపి అరెస్ట్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓ వ్యక్తి.. ఇండోర్​లోని ఈ ముఠాతో పరిచయం పెంచుకున్నాడు. ఇతను.. దొంగలను విజయవాడకు రప్పిస్తాడు. వీరంతా కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో.. పగలు రెక్కీ నిర్వహిస్తారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని.. రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడతారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

అయితే.. విజయవాడలో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస నేరాలపై పోలీసులు నిఘా పెట్టారు. కొందరు ఊళ్లకు వెళుతూ.. ఎల్​హెచ్ఎంఎస్ సిస్టమ్​ను ఇళ్లలో ఏర్పాటు చేసుకున్నారు. దాని ఆధారంగా నిందితులను సునాయాసంగా పట్టుకోగలిగారు. కాకినాడకు చెందిన వ్యక్తితో పాటు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ నిందితుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కిలోల వెండి, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.