ETV Bharat / city

'లాక్​డౌన్​ను పొడిగించడమే ఉత్తమం'

లాక్‌డౌన్​ను పొడిగించాలని ప్రధాని మోదీని తెరాస పార్లమెంటరీ పార్టీ కోరింది. లాక్ డౌన్ వల్ల పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ... ప్రస్తుత పరిస్థితుల్లో పొడిగించడం మినహా మరో మార్గం లేదని పేర్కొంది. అఖిల పక్ష పార్లమెంటరీ పార్టీ నేతలతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో... తెరాస పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు, లోక్​సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

pm modi
pm modi
author img

By

Published : Apr 8, 2020, 5:01 PM IST

Updated : Apr 8, 2020, 5:38 PM IST

కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే.. లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని దేశంలోని దాదాపు అన్ని పార్లమెంటరీ పార్టీలు ప్రధాని మోదీని కోరాయి. లాక్ డౌన్ ఒక్కసారిగా ఎత్తేవేయలేమని.. ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అఖిలపక్ష నేతలతో ప్రధాని పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ... ప్రస్తుత పరిస్థితుల్లో పొడిగించడం మినహా మరో మార్గం లేదని తెరాస పార్లమెంటరీ పార్టీ స్పష్టంగా ప్రధానికి తెలిపింది. అఖిల పక్ష పార్లమెంటరీ పార్టీ నేతలతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో... తెరాస పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు, లోక్​సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

pm modi
ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న తెరాస ఎంపీలు

కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు

ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తే గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని తెరాస నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని తెరాస పార్లమెంటరీ నేతలు ప్రధానికి వివరించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కానీ.. ప్రాణాలు కాపాడటం కన్నా ఆర్థిక అంశాలు ముఖ్యం కాదని తెలిపారు. కరోనా, లాక్ డౌన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్రం పలు చర్యలు చేపట్టిందని... ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రధానికి కేకే, నామ వివరించారు. వలస కార్మికులకు 12 కిలోల రేషన్, వెయ్యి రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు.

ఆ ఘటన ఆందోళన కలిగించింది

దేశంలో సుమారు 60 మిలియన్ టన్నుల ఆహార నిల్వలు ఉన్నాయని.. వాటిని ప్రజలకు చేర్చాలని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రవాణా సవాల్​గా మారిందని తెలిపారు. వడ్డీ రేట్లు తగ్గించాలని.. ధనం పెంచాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలకు నిధులను పెంచాలని కేకే, నామ కోరారు. అన్నీ ప్రధాని కార్యాలయం నుంచే నడపకుండా.. వికేంద్రీకరణ చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఆదాయం రోజుకు రూ.400 కోట్ల నుంచి కోటి రూపాయలకు పడిపోయిందని వివరించారు. తబ్లీజ్ జమాత్ ఘటన కొంత ఆందోళన కలిగించిందన్నారు.

ఇదీ చూడండి: సీఎంలతో శనివారం మోదీ భేటీ- లాక్​డౌన్​పై నిర్ణయం!

Last Updated : Apr 8, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.