Modi Hyderabad Tour: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు గానూ.. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో దిల్లీలో బయలుదేరి.. 2.55 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. మంత్రి తలసానికి వెయిటింగ్ ఇన్ మినిస్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. భాజపా రాష్ట్ర నాయకత్వం ప్రధానికి ఘనస్వాగతం పలికింది. అనంతరం బేగంపేట నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు.
ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..
- మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో దిల్లీలో బయలుదేరి.. 2.55 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
- బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 3.15కు హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు.
- 3.45 కు హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు.
- సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్‌గా ఉంచారు.
- ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌గా ఉంచారు.
- సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్తారు.
- సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు సభలో పాల్గొంటారు.
- రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి.. రాజ్‌భవన్‌కు గానీ.. హోటల్‌కు గానీ చేరుకుని బస చేస్తారు.
- సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఏపీకి బయలుదేరుతారు.
- ఉదయం 10.10 గంటలకు విజయవాడ చేరుకుని ఏపీలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇవీ చూడండి: