ETV Bharat / city

'కష్టపడి కొనుగోలు చేశాం... న్యాయం చేయండి' - రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట్​ పరిధిలోని పలు సర్వే నంబర్లలోని ప్లాట్లను కొందరు వ్యక్తులు అమ్మడానికి వీల్లేకుండా కేసులు వేశారని యజమానులు ఆందోళన చేశారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం కొన్న భూములు ప్రస్తుతం అమ్మడానికి వీళ్లేకుండా పోవడంపై పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

కష్టపడి కొనుగోలు చేశాం... న్యాయం చేయండి అంటున్న ప్లాట్ల ఓనర్లు
author img

By

Published : Oct 13, 2019, 9:31 PM IST

కష్టపడి కొనుగోలు చేశాం... న్యాయం చేయండి అంటున్న ప్లాట్ల ఓనర్లు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం పెద్ద అంబర్​పేట్ పరిధిలోని 402 ఎకరాల స్థలాన్ని 1984లో పలు సర్వే నంబర్లతో ప్లాట్లుగా విభజించి విక్రయించారు. 20, 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఈ ప్లాట్లపై కొందరు వ్యక్తులు కేసులు వేసి అమ్మకుండా చేస్తున్నారని యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 300 మంది ఈరోజు అక్కడ సమావేశమయ్యారు.

కేసుపై బాధితుల ఆందోళన...

ప్లాట్లు చేతులు మారుతూ... పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయని 20, 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లపై ఈ మధ్య కొందరు వ్యక్తులు కేసులు వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్​ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశమై తమ స్థలాలను రక్షించుకునేందుకు చర్చించుకున్నారు. ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన ప్లాట్లను తమకు కాకుండా చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్​కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ప్లాట్లు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Intro:రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్పేట్ పరిధిలోని సర్వే నెంబర్ 250 నుండి 263, 265, 266, 272 నుండి 276, 293 నుండి 295, 321, 322, 225 నుండి 328 నంబర్లలో 402 ఎకరాల స్థలాన్ని 1984లో ప్లాట్లుగా చేసి విక్రయించారు. ఇట్టి ప్లాట్లు చేతులు మారుతూ పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయని 20, 30 సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్ల పై ఈ మధ్య కొందరు వ్యక్తులు కేసులు వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తమ ప్లాట్ల స్థలంలో సుమారు 300 మంది ప్లాట్ల యజమానులు సమావేశమయ్యారు. ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశమై తమ ప్లాట్లన రక్షించుకునేందుకు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ప్లాట్ల యజమానులు మాట్లాడుతూ ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన ఫ్లాట్ లను తమకు కాకుండా చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు ఎమ్మార్వో వో, ఆర్ డి ఓ, కలెక్టర్ లకు ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినా తమ సమస్యకు పరిష్కారం చేయడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ప్లాట్లు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు.

బైట్ : కృష్ణారెడ్డి (అధ్యక్షులు, ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్)
బైట్ : వీరమని (బాధితురాలు హైటెక్ సిటీ)
బైట్ : అన్వర్ ఖాన్ (బాధితుడు గోల్కొండ)
బైట్ : మారయ్య (బాధితుడు నల్గొండ)
బైట్ : నందా రెడ్డి (బాధితుడు వనస్థలిపురం)
బైట్ : రంగారెడ్డి (బాధితుడు కోహెడ)

Body:TG_Hyd_27_13_Plot Owners Protest_Ab_TS10012

Conclusion:TG_Hyd_27_13_Plot Owners Protest_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.