సంక్రాంతి పర్వదినం సందర్బంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతుంది. ప్రయాణికులతో పాటు వాళ్ల బంధువులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్లాట్ ఫాం టికెట్ ధరలను భారీగా పెంచింది. పెంచిన ధరలు ఈనెల 20వ తేదీ వరకు అమలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేష్ వెల్లడించారు.
సికింద్రాబాద్ ఫ్లాట్ ఫాం ధర రూ.10 నుంచి రూ.50 వరకు పెంచామని సీపీఆర్ఓ అన్నారు. హైదరాబాద్(నాంపల్లి), కాచిగూడ, వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబాబాద్, రామగుండం, మంచిర్యాల, భధ్రాచలంరోడ్, వికారాబాద్, తాండూర్, బీదర్, పర్లివైజ్ఞాత్, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో ఫ్లాంట్ ఫాం టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20 వరకు పెంచామన్నారు. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ తెలిపింది.
ఇదీ చదవండి : రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్