ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం దేవస్థానంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధించారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయించినా, వినియోగించినా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు హెచ్చరించారు. కొండపై పలు దుకాణాలు, క్యాంటీన్లలో ప్లాస్టిక్ వాడుతున్నట్లు గుర్తించారు. ఇలా వినియోగిస్తే రూ.10 వేలు జరిమానా, అవసరమైతే లీజు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్ అవగాహన