ETV Bharat / city

రైతు కోటా సీట్ల భర్తీ కోసం పీజేటీఎస్​ఏయూ నోటిఫికేషన్​ - ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ

2020-21 విద్యా సంవత్సరం బీటెక్ - అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్, బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు సంబంధించి రైతు కోటా సీట్ల భర్తీ కోసం పీజేటీఎస్​ఏయూ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం www.pjtsau.edu.in చూడాలని రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్ సూచించారు.

pjtsau released notification for agriculture engineering

author img

By

Published : Oct 16, 2020, 5:12 PM IST

2020-21 విద్యా సంవత్సరం బీటెక్ - అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్, బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు సంబంధించి రైతు కోటా సీట్ల భర్తీ కోసం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్ ఎంసెట్ - 2020 ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ ఆధారంగా బీటెక్ - అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్ కోర్సులో 18 సీట్లు, బీటెక్- ఫుడ్ టెక్నాలజీ కోర్సులో 18 సీట్లను తాము భర్తీ చేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ వెల్లడించారు.

రాష్ట్రంలోని పల్లెల్లో కీలకమైన వ్యవసాయం అనుబంధ రంగాల పట్ల ఆసక్తి, అభిరుచి దృష్టిలో పెట్టుకుని ఆ వర్గాలకు నాణ్యమైన, ఉత్తమ సేవలు అందించేందుకు వీలుగా రైతు కోటాలో సీటు పొందే అభ్యర్థి విధిగా కనీసం 4 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో (ఫామ్-1) విద్యాభ్యాసం చేసి ఉండాలని తెలిపారు. ఇక తమ సొంత ఊరిలో కూడా కనీసం ఒక ఎకరం విస్తీర్ణం భూమి (ఫామ్-2) తల్లి లేదా తండ్రి లేదా అభ్యర్థి పేరిట కలిగి ఉండాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం www.pjtsau.edu.in చూడాలని రిజిస్ట్రార్ సూచించారు.

ఇదీ చూడండి:మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్య పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.