రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు పిల్ దాఖలు చేశారు. లాక్‌డౌన్ సమయంలోనూ మధ్యాహ్న భోజనం పెట్టాలని పిటిషనర్ కోరారు. మధ్యాహ్న భోజనం, ఆన్‌లైన్ తరగతులు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వాన్ని సంప్రదించాలని హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది.
ఇదీ చూడండి : ఒకే వేదికపై ఉత్తమ్, కేటీఆర్.. పీసీసీ చీఫ్‌కు మంత్రి అభినందనలు