ETV Bharat / city

భౌతిక దూరం పాటిస్తే.. కరోనాను అరికట్టొచ్చు : సీపీ అంజనీకుమార్ - hyderabad police comissioner

లాక్​డౌన్​ సమయంలో.. భౌతిక దూరం పాటించడమే ఉత్తమ మార్గమని నగర పోలీస్​ కమిషనర్​ అంజనీ కుమార్ అన్నారు. లాక్​డౌన్​ విధుల్లో ఉన్న పోలీసులకు ఆయన సేఫ్టీ కిట్​, వాటర్​ బాటిల్​, బ్యాగు అందజేశారు.

Physical Distance Is Best Way To Discrease Corona
భౌతిక దూరం పాటిస్తే.. కరోనా అరికట్టవచ్చు : సీపీ అంజనీ కుమార్
author img

By

Published : May 4, 2020, 9:53 PM IST

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడమే మార్గమని హైదరాబాద్​ నగర పోలీస్​ కమిషనర్​ అంజనీ కుమార్​ అన్నారు. పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర రంగాల సిబ్బందికి 2020 సంవత్సరంలో కొవిడ్​-19 నివారణకు విధులు నిర్వర్తించామని భావి తరాలకు గర్వంగా చెప్పే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండాల్సిన సమయం ఇది అని ఆయన గుర్తు చేశారు.

లాక్​డౌన్​ సమయంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఆయన సేఫ్టీ కిట్, స్టీల్​ వాటర్​ బాటిల్, బ్యాగు అందజేశారు. నగరంలోని నార్త్​జోన్​లో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య తక్కువగా ఉందని, ఆ ప్రాంతంలో లాక్​డౌన్​ కఠినంగా అమలు చేయడం వల్లే ఈ ఫలితం వచ్చిందని ఆయన అన్నారు. ప్రజలు సహకరిస్తే.. హైదరాబాద్​ను​ అతి తక్కువ రోజుల్లోనే రెడ్​ జోన్​ నుంచి గ్రీన్​జోన్​లోకి తీసుకురావచ్చని సీపీ అన్నారు.

ఇదీ చదవండి: శానిటైజర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.