ETV Bharat / city

మద్యం మత్తులో దివ్యాంగుడు హల్చల్​.. పోలీసులకు ధమ్కీ ఇస్తూ నానా రచ్చ.. - పోలీసులకు మందుబాబు ధమ్కీ

Drunkard Hulchal: కారు నడపిన యువకుడు మద్యం తాగాడు. అందులో ఉన్న అతడి సోదరుడు మద్యం మత్తులోనే ఉన్నారు. పైగా కారులో మద్యం సీసాలూ ఉన్నాయి. ఇవన్ని చూసి.. కారు స్వాధీనం చేసుకుని.. ఇద్దరిని తర్వాతి రోజు వచ్చి ఫైన్​ కట్టి వాహనం తీసుకెళ్లమన్నారు. ఇదంతా నచ్చని.. డ్రైవర్​ సోదరుడు మాత్రం ఏకంగా పోలీసులకే ధమ్కీ ఇచ్చాడు. మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించాడు.

phisycally handicapped Drunkard Hulchal in malakpet and warning to police

author img

By

Published : Jul 19, 2022, 3:56 PM IST

Drunkard Hulchal: హైదరాబాద్​ మలక్‌పేటలో డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుండగా.. ఓ దివ్యాంగుడు హల్చల్‌ చేశాడు. పోలీసులతో వితండవాదం చేస్తూ.. వారి విధులకు కాసేపు అంతరాయం కలిగించాడు. సోమవారం రాత్రి మలక్‌పేట ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో భాగంగా వాహనాలను ఆపి.. బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన ఓ కారును నిలిపి తనిఖీ చేయగా.. నడిపిస్తోన్న యువకుడు మద్యం సేవించినట్లు తేలింది. అదే సమయంలో కారులో అతడి సోదరుడైన దివ్యాంగ వ్యక్తి కూడా మద్యం సేవించి ఉన్నాడు.

మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తిని పోలీసులు విచారించి.. కారును స్వాధీనం చేసుకున్నారు. తర్వాతి రోజు పోలీస్​స్టేషన్​కు వచ్చి.. జరిమానా చెల్లించి కారు తీసుకెళ్లాలని సూచించారు. అయితే.. దీనికి ఎంత మాత్రం ఒప్పుకోని దివ్యాంగ వ్యక్తి ట్రాఫిక్​ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దివ్యాంగుడినైన తనను ఎందుకు ఆపారంటూ.. హల్చల్​ చేశాడు. ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా.. మద్యం మత్తులో వితండవాదం చేశాడు. అక్కడితో ఆగకుండా.. విధుల్లో ఉన్న పోలీసులను దుర్భాషతాడుతూ.. చొక్కా పట్టుకుని బెదిరించాడు. తనను ఆపినందుకు ప్రతిగా.. ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ని వెళ్లనీయకుండా ద్విచక్రవాహనాన్ని అడ్డుకుని చాలాసేపు హంగామా చేశాడు. ఇలా చేయటం మంచి పద్దతి కాదని.. విధులకు ఆటంకం కలిగించటం శిక్షార్హమని ఎంత చెప్పినా వినకుండా నానా రచ్చ చేశాడు.

ఇదంతా కాకుండా పైపెచ్చు.. దివ్యాంగుడైన తనపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని.. చరవాణిలో తానే వీడియోలు తీసుకుంటూ పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు. చాలాసేపటి వరకు పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబుకు.. పోలీసులు సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. కారు నడుపుతున్న యువకుడిపై మాత్రం డ్రంకన్​డ్రైవ్​ కేసు నమోదు చేసి.. కారు సీజ్‌ చేశారు.

మద్యం మత్తులో దివ్యాంగుడు హల్చల్​.. పోలీసులకు ధమ్కీ ఇస్తూ నానా రచ్చ..

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.