ETV Bharat / city

Ph.D Set: 6 వర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఇక సెట్‌! - PhD admission exam in ou

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీహెచ్‌డీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరపాలని నిర్ణయించారు. దీనిపై విధివిధానాల రూపకల్పనకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఓ కమిటీని నియమించనున్నారు

PhD admission exam in 6 telangana universities

author img

By

Published : Jul 2, 2021, 8:26 AM IST

రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీల ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్‌) నిర్వహించాలని ఆయా వర్సిటీల ఉపకులపతులు నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ సమక్షంలో గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దోస్త్‌ ప్రవేశాలు, ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు ఉన్నత విద్యామండలి సమావేశం ఏర్పాటుచేయగా ఓయూ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఉపకులపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరపాలని నిర్ణయించారు. దీనిపై విధివిధానాల రూపకల్పనకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఓ కమిటీని నియమించనున్నారు. సమావేశంలో దోస్త్‌ కన్వీనర్‌ ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపకులపతులు రవీందర్‌, గోపాల్‌రెడ్డి, సీతారామారావు, తాడికొండ రమేష్‌, రాథోడ్‌, రవీందర్‌ గుప్తా పాల్గొన్నారు.

ముఖ్య నిర్ణయాలు

  • పీజీ ప్రవేశాల కోసం 2021-22 విద్యా సంవత్సరానికి సైతం ఓయూనే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) నిర్వహిస్తుంది.
  • అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ)కి ఉమ్మడి విద్యా కాలపట్టిక(కామన్‌ అల్మానాక్‌)కు ఆమోదం తెలిపింది.
  • నాలుగు విశ్వవిద్యాలయ, ప్రభుత్వ కళాశాలల్లో బీఏ ఆనర్స్‌ కోర్సును ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతారు. దీనికి పాఠ్య ప్రణాళికను ఓయూ రూపొందించి, పర్యవేక్షిస్తుంది.
  • క్లస్టర్‌ విధానాన్ని అమలుచేస్తారు. దీని ప్రకారం ప్రభుత్వ కళాశాలల్లోని మానవ వనరులు, ప్రయోగశాలలు తదితరాలను సమీప కళాశాలలు కూడా వినియోగించుకుంటాయి. ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలకే ఇది వర్తిస్తుంది. ఒకచోట ఒక సబ్జెక్టులో ఎక్కువ మంది ఆచార్యులు/అధ్యాపకులు ఉంటే కొరత ఉన్న కళాశాలలకు వెళ్లి బోధిస్తారు. అలాగే ఏదైనా ఒక సబ్జెక్టుపై ఆసక్తి ఉండి చదివే కళాశాలలో అది లేకుంటే విద్యార్థులు ఉన్నచోటకు వెళ్లి చదువుకుంటారు. దీనిపై కమిటీని నియమించి విధివిధానాలు రూపొందిస్తారు.
  • అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం రూపొందించిన ఇ-వనరులు(ఆన్‌లైన్‌ పాఠాలు),కోర్సు మెటీరియల్‌ తదితరాలను అన్ని వర్సిటీలూ వినియోగించుకోవచ్చు.
  • వరుసగా రెండేళ్లు ఒక్కరూ చేరని కళాశాలల జాబితాను దోస్త్‌ వెబ్‌సైట్లో ఉంచుతారు. అందులో చేరేందుకు ఆప్షన్‌ ఇచ్చుకోవాలా? లేదా? అన్నది విద్యార్థులు నిర్ణయించుకునేందుకు వీలవుతుంది.

మొదటి సెమిస్టర్‌ విద్యా కాలపట్టిక

  • తరగతుల ప్రారంభం: సెప్టెంబరు 1న
  • దసరా సెలవులు: అక్టోబరు 9-17 వరకు
  • అంతర్గత పరీక్ష-1 : నవంబరు 10-12 వరకు
  • అంతర్గత పరీక్ష-2 : డిసెంబరు 21-23 వరకు
  • బోధనకు చివరి పనిదినం: జనవరి 12
  • సాధన సెలవులు, ప్రయోగ పరీక్షలు: 2022 జనవరి 13- 23 వరకు
  • పరీక్షలు: జనవరి 24 నుంచి ఫిబ్రవరి 16

రెండో సెమిస్టర్‌ కాలపట్టిక

  • తరగతుల ప్రారంభం: ఫిబ్రవరి 17న
  • పరీక్షలు: 2022 జూన్‌ 17- జులై 8 వరకు
  • సెలవులు: 2022 జులై 9- ఆగస్టు 11 వరకు
  • కళాశాలల పునఃప్రారంభం: 2022 ఆగస్టు 12

ఇదీ చూడండి: 'సార్వత్రిక ఉచిత వైద్యవ్యవస్థే ఉత్తమం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.