ETV Bharat / city

ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంపు.. ఉత్తర్వులు జారీ - పెట్రోల్, డీజిల్​పై వ్యాట్ పెంచిన జగన్ ప్రభుత్వ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. పెట్రోల్‌పై రూ. 1.24, డీజిల్‌పై 93 పైసలు వ్యాట్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వ్యాట్‌ 2005ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంపు

author img

By

Published : Jul 20, 2020, 9:13 PM IST

పెట్రోల్​పై రూ. 1.24, డీజిల్​పై రూ.0.93 చొప్పున వ్యాట్​ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వ్యాట్ చట్టం 2005ను సవరించింది. పెట్రోలుపై 31 శాతం పన్నుతోపాటు రూ.4 అదనంగా సుంకం విధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. డీజిల్​పై 22.25 శాతం వ్యాట్​తో పాటు రూ.4 అదనంగా సుంకం విధించినట్టు స్పష్టం చేసింది.

కొవిడ్ కారణంగా రావాల్సిన ఆదాయం పడిపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్​ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. కరోనా కారణంగా రూ.4480 కోట్ల మేర రావాల్సిన ఆదాయం.. ప్రస్తుతం రూ.1323 కోట్లు మాత్రమే వచ్చిందని వెల్లడించారు. ఈ కారణంగా పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై వ్యాట్ సవరించిక తప్పని పరిస్థితి నెలకొన్నట్టు ప్రభుత్వం వివరించింది. ఏపీ కంటే పొరుగు రాష్ట్రాల్లో ఈ వ్యాట్ అధికంగా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుత పెంపుదల 2015-18 సంవత్సరాల మధ్య వసూలు చేసిన ప్రకారమే ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.