ఏపీ ఎన్నికల కమిషనర్ నియామకం గవర్నరు విచక్షణాధికారం మేరకు జరగాలని, ఈ విషయంలో మంత్రి మండలి పాత్ర ఏమి ఉందదని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా కొనసాగడం సరికాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. విశ్రాంత ఐజీ డాక్టర్ సుందర్ కుమార్ దాస్ (కోవారెంటో ) వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఎస్ఈసీగా రమేశ్ కుమార్ కొనసాగింపు ఏపీ హైకోర్టు తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. మంత్రి మండలి సిఫారసు మేరకు రమేశ్ కుమార్ 2016లో ఎస్ఈసీగా నియమితులయ్యారని గుర్తు చేశారు. ఆయన నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు.
ఇవీచూడండి: పోలీసులు విశ్రాంతి తీసుకోండి: డీజీపీ మహేందర్ రెడ్డి