Performance of Telangana Police : పనిని కేంద్రీకృతం చేయడం కంటే విభజించి శోధించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ పోలీసులు నిరూపిస్తున్నారు. సామర్థ్యాన్ని బట్టి ఠాణాలో పనిచేసే సిబ్బంది అందరికీ పని కేటాయింపును ఇందుకు మార్గదర్శకంగా ఎంచుకున్నారు. శిక్షల శాతం పెరుగుతుండడంతో ఈ విధానమే కీలకమని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం నాటితో పోల్చితే శిక్షల శాతం రెట్టింపైంది. 28.63 శాతం నుంచి 51 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనం. పరిశోధనను ఒకరిద్దరికే పరిమితం చేయకుండా బ్లూకోల్ట్స్, కోర్టుడ్యూటీ, టెక్‌టీమ్, ఇన్వెస్టిగేషన్.. తదితర 17 అంశాల వారీగా విభజించి సిబ్బంది ని మమేకం చేసి ఈఫలితాల్ని సాధించగలిగారు.
అటు గల్లీ గస్తీ.. ఇటు టెక్ పోలీసింగ్.. శాంతిభద్రతల పర్యవేక్షణలో విజిబుల్ పోలీసింగే ప్రధానం. రహదారులపై పోలీసులు కనిపిస్తూ ఉండటమే నేర నియంత్రణలో ప్రధానం. అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో టెక్ పోలీసింగ్‌ను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో గల్లీ గస్తీని పెంచడంతో పాటు పోలీసింగ్‌లో సాంకేతికత పెంపుపై దృష్టి సారించడం ద్వారా మెరుగైన ఫలితాల దిశగా అడుగులేస్తున్నారు.
* పెటోల్ర్ ఆఫీసర్ల తక్షణ ప్రతిస్పందన సమయం 15 నుంచి 10 నిమిషాలకు తగ్గింది.
* ఠాణాలకు వచ్చే పిటిషన్లను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసే విధానం మెరుగుపడింది. 16.68 నుంచి 94.58 శాతానికి పెరిగింది.
* నేరస్థుల తనిఖీ శాతం 18.56 నుంచి 81.23 శాతానికి పెరిగింది.
* విజిబుల్ పోలీసింగ్‌లో పాయింట్ బుక్స్ విజిటింగ్ శత శాతానికి చేరింది. రెండేళ్ల ముందు ఇది 21.45 శాతం ఉండేది. పాయింట్‌బుక్స్ కవరేజీ 57.91 నుంచి 94.13 శాతానికి పెరిగింది.
* సమన్ల డేటా ఎంట్రీ గతంలో 5 శాతమే ఉండగా ఏకంగా 99.18 శాతానికి చేరుకుంది.
* సీసీటీఎన్‌ఎస్ డేటా ఎంట్రీ 20.85 నుంచి 95.7 శాతానికి పెరిగింది.
* ట్రాఫిక్ ఉల్లంఘనల చలానాల గుర్తింపు 19.04 నుంచి 50.16 శాతానికి చేరింది.
ఇవీ చదవండి: