ETV Bharat / city

'తెలుగుదేశమా.. మీకు రోడ్డు వేసేయాలా ఏంటి..?' - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

MINISTER AMBATI: ఏపీలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పల్నాడు జిల్లా రాజుపాలెంలో పర్యటించిన ఆయనను.. ఓ దివ్యాంగురాలు నిలదీసింది. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని మూడేళ్లయినా రాలేదని చెప్పగా.. ఇంటికి నాలుగు విద్యుత్ మీటర్లు ఉన్నాయని.. అందుకే ఇవ్వలేదని అధికారులు చెప్పడంతో మంత్రి ముందుకెళ్లారు.

'తెలుగుదేశమా.. మీకు రోడ్డు వేసేయాలా ఏంటి..?'

author img

By

Published : Aug 1, 2022, 8:05 PM IST

'తెలుగుదేశమా.. మీకు రోడ్డు వేసేయాలా ఏంటి..?'

Ambati Rambabu on TDP: ఆంధ్రప్రదేశ్​లో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబును ఓ దివ్యాంగురాలు నిలదీశారు. పల్నాడు జిల్లా రాజుపాలెంలో మంత్రి పర్యటించారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని మూడేళ్లయినా రాలేదని ఓ దివ్యాంగురాలు మంత్రికి తెలిపారు. వాళ్ల ఇంటికి నాలుగు విద్యుత్ మీటర్లు ఉన్నాయని.. అందుకే ఇవ్వలేదని అధికారులు చెప్పారు. ఆ మాటతో మరేమీ మాట్లాడకుండా మంత్రి ముందుకు వెళ్లటంతో.. ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డు వేయాలని రాజుపాలెంనకు చెందిన ఓ వ్యక్తి మంత్రి అంబటిని అడిగారు. దీనిపై స్పందించిన మంత్రి.. ఈయన మన ఓటరేనా అంటూ పక్కనున్న వాళ్లని ఆరా తీశారు. తెలుగుదేశం అని చెప్పడంతో.. అయితే రోడ్డు వేసేయాలా ఏంటి అని అడిగారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వివరించి మంత్రి అక్కడి నుంచి వెళ్లారు. అంతకు ముందు బుల్లబ్బాయి అనే ఓ వ్యక్తి.. మంత్రితో పాటు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని గ్రహించిన మంత్రి.. మరో వీధికి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు చిత్రీకరించిన మీడియాను మంత్రి అంబటి పీఏ బెదిరించారు. ఫోన్లలో వీడియోలు తొలగించాలన్నారు. సంబంధిత వీడియోలను పోలీసులు తొలగింపజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.