ETV Bharat / city

Free Water : ఉచిత నీరన్నారు.. బిల్లుతో వాత పెడుతున్నారు - issues in free water supply scheme

గ్రేటర్‌ హైదరాబాద్​లో అమలు చేస్తున్న ఉచిత మంచినీటి పథకం నల్లాదారులకు చుక్కలు చూపుతోంది. ముఖ్యంగా జలమండలి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆధార్‌ను అనుసంధానం చేసుకున్న నల్లాదారులకు కూడా భారీగా బిల్లులు వస్తున్నాయి. ఆధార్‌ లింకేజీ పూర్తి అయిందని...మీ మీటరు కూడా పనిచేస్తుందంటూ తొలుత వినియోగదారుల సెల్‌ఫోన్‌కు సమాచారం వెళుతోంది. వెంటనే అయిదు నెలల నీటి బిల్లులు చెల్లించాలంటూ కొద్ది రోజుల తర్వాత ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు. దీంతో అయోమయానికి గురవుతున్నారు.

free water scheme, free water scheme in Hyderabad
హైదరాబాద్​లో ఉచిత నీరు, ఉచిత నీటి పథకం, గ్రేటర్​లో ఉచిత నీటి పథకం
author img

By

Published : Jun 1, 2021, 7:55 AM IST

గ్రేటర్‌ వ్యాప్తంగా ఉచిత తాగునీటి పథకం కింద 4 లక్షల వినియోగదారులు తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. మిగతా వారికి గత డిసెంబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 5 నెలల బిల్లులు ఒకేసారి పంపుతున్నారు. అయితే ఇప్పటికే ఆధార్‌ లింక్‌తోపాటు మీటర్‌ సక్రమంగా పనిచేస్తున్న వినియోగదారుల నెత్తిన కూడా ఛార్జీల బండ పడుతోంది. తన మీటరు పనిచేయడంతోపాటు ఆధార్‌తో లింక్‌ చేసుకున్నా సరే...తనకు రూ.3337(క్యాన్‌ నెంబరు 119376413) బిల్లు పంపారని బండ్లగూడకు చెందిన ఓ వినియోగదారుడు వాపోయాడు. గ్రేటర్‌ వ్యాప్తంగా ఇలాంటి వారు చాలామందే ఉన్నారు.

  • ఈ నేపథ్యంలో 155313 నెంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. నాగోలు, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో చాలామందికి ఇలా రావడంతో వారంతా సమీపంలోని జలమండలి కార్యాలయాలను ఆశ్రయిస్తూ లబోదిబోమంటున్నారు. చందానగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట పరిధిలోని పలువురికి ఇలాంటి ఎస్‌ఎంఎస్‌లే అందుతున్నాయి.
  • గ్రేటర్‌ వ్యాప్తంగా 10.08 లక్షల నల్లాదారులు ఉచిత పథకానికి అర్హత సాధించగా.. ఇందులో కేవలం 2.20 లక్షల నల్లాలకు మాత్రమే మీటర్లు ఉన్నాయి. తాజాగా ఈ స్కీం కిందకు రావాలంటే ప్రతి నల్లాదారుడు నీటి మీటరు అమర్చుకోవాలని నిబంధన పెట్టారు. అయితే కేవలం లక్షలోపే మీటర్లు అమర్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
  • మీటరు పనిచేస్తోందో లేదో చూడాలంటే జలమండలి సిబ్బంది ఇంటింటికి వెళ్లి తనిఖీ చేయాలి. స్థానిక సిబ్బందికి ఈ బాధ్యత అప్పగించారు. అయితే కరోనా విజృంభణతో ఇంటింటి సర్వే చేపట్టడంలో ఆటంకం ఏర్పడింది. దీంతో చాలా మీటర్లు పనిచేస్తున్నప్పటికీ...చేయనట్లు చూపుతుండటంతో అలాంటి నల్లాదారులు ఉచిత పథకానికి దూరమవుతున్నారు.
  • మరోవైపు బిల్లుల లెక్కింపు విషయంలో కూడా హేతుబద్ధత కన్పించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. మొత్తం యూనిట్ల నుంచి సబ్సిడీ యూనిట్లు తీసివేసి...మిగతా యూనిట్లకు లెక్కకట్టాలి. అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా లెక్క కడుతున్నారు.
  • ఇక అపార్ట్‌మెంట్లలో ఏ ఒక్క ఫ్లాటు ఓనరు అనుసంధానం చేయకపోయినా...మిగతా వారందర్ని ఉచిత పథకం కింద గుర్తించడం లేదు. ఇది కూడా సరికాదని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి అపార్ట్‌మెంట్లకు ప్రస్తుతం వేలల్లోనే బిల్లులు వస్తున్నాయి.

ఇదీ చదవండి Drdo: ఇవాళ మార్కెట్లోకి యాంటీబాడీస్ పరీక్ష కిట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.